తాష్కెంట్: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్ పూర్ణిమ ఎనిమిది జాతీయ రికార్డులు తన పేరిట రాసుకుంటూ.. మహిళల ప్లస్ 87 కేజీల విభాగంలో పసిడి పతకం కైవసం చేసుకుంది. గురువారం జరిగిన పోటీల్లో పూర్ణిమ 229 కేజీలు (102+127) బరువెత్తి వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది. పురుషుల ప్లస్ 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ సింగ్ 348 కేజీలు (161+187) ఎత్తి రజత పతకం సొంతం చేసుకోగా.. మహిళల 87 కేజీల ఈవెంట్లో అనురాధ 195 కేజీలు (90+105) బరువెత్తి కాంస్యం చేజిక్కించుకుంది.