IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్దమయ్యాయి పంజాబ్ కింగ్స్(Punjab Kings), ముంబై ఇండియన్స్(Mumbai Indians). ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఈ రెండు జట్లు టాప్ 2 కోసం ‘నువ్వా నేనా’ అన్నట్టు తలపడనున్నాయి. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో విజయంతో టేబుల్ టాపర్ అవ్వాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. కీలకమైన ఈ పోరులో ఇరుజట్లు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. పంజాబ్ తుది జట్టులోకి పేసర్లు వైశాక్ విజయ్ కుమార్, కైలీ జేమీసన్‌లను తీసుకుంది. ఇక విజయోత్సాహంతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలనుకుంటున్న ముంబై.. కూడా పేసర్ అశ్వనీ కుమార్‌కు చోటు కల్పించింది. ఇప్పటివరకూ ఇరుజట్లు 32 సార్లు ఎదురుపడగా.. ముంబై 17 సార్లు, పంజాబ్ 15 పర్యాయాలు వైచేయి సాధించాయి.
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, కైలీ జేమీసన్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంప్యాక్ట్ సబ్స్ : ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, గ్జావియర్ బార్ట్లెట్, ముషీర్ ఖాన్.
🚨 Toss 🚨@PunjabKingsIPL won the toss & opted to bowl first against @mipaltan.
Updates ▶ https://t.co/Dsw52HOtga#TATAIPL | #PBKSvMI pic.twitter.com/Pbmm2rkM9w
— IndianPremierLeague (@IPL) May 26, 2025
ముంబై తుది జట్టు : రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంప్యాక్ట్ సబ్స్ : కరన్ శర్మ, కార్బిన్ బాస్చ్, రాజ్ బవ, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు.