IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మరో చిచ్చరపిడుగు అడుగుపెడుతున్నాడు. వారం క్రితం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడిన మిచెల్ ఓవెన్ (Mitchell Owen) ఇప్పుడు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) గూటికి చేరాడు. విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేని పరిస్థితుల్లో తాత్కాలిక ప్లేయర్‌గా ఓవెన్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ తీసుకుంది. గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) స్థానాన్ని ఓవెన్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని గురువారం ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
ఇప్పటికే ఐపీఎల్ కోసం దక్షిణాఫ్రికా క్రికెటర్ కార్బిన్ బాస్చ్ (Corbin Bosch) పీఎస్ఎల్ను వీడాడు. ఇప్పుడు ఓవెన్ సైతం పాకిస్థాన్‌కు షాకిస్తూ పంజాబ్ స్క్వాడ్‌లో చేరనున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఓవెన్ ఈమధ్య టీ20ల్లో ఇరగదీస్తున్నాడు. బిగ్‌బాష్ లీగ్(BigBash League)లో 39 బంతుల్లోనే రికార్డు శతకంతో రికార్డులు బద్ధలు కొట్టాడు. దాంతో, ఈ హిట్టర్‌ను కొనేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పలు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు పెషావర్ జల్మీ అతడిని సొంతం చేసుకుంది. అయితే.. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్, పీఎస్ఎల్ వాయిదా పడ్డాయి.
Owen has entered the den! 🔥 pic.twitter.com/u6RYiiSOBO
— Punjab Kings (@PunjabKingsIPL) May 15, 2025
మే 17 నుంచి రెండు టోర్నీలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తమ దేశానికే చెందిన ఓవెన్‌తో మాట్లాడి పంజాబ్ తరఫున ఆడేందుకు ఒప్పించాడు. ఓవెన్ రాకతో పంజాబ్ బ్యాటింగ్ యూనిట్ మరింత దుర్భేద్యంగా మారనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న శ్రేయాస్ అయ్యర్ సేన ఇతడిని బ్యాటింగ్ అస్త్రంగా ఉపయోగించనుంది. బిగ్‌బాష్ లీగ్లోబాదిన ఓపెవన్ పొట్టి క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాడు.
క్రీజులోకి రావడమే ఆలస్యం బౌలర్లపై విరుచుకుపడే ఓవెన్ పీఎస్ఎల్లో ఓవెన్ పెషావర్ జల్మీ (Peshawar Zalmi) తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడాడు. 192.45 స్ట్రయిక్ రేటుతో అతడు 102 రన్స్ కొట్టాడు. అంతకుముందు ఈ యువకెరటం దక్షిణాఫ్రికా20లీగ్‌లో సైతం ఆడాడు. పార్ల్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇకపై ఐపీఎల్లో అతడు తన బ్యాటింగ్ ప్రతాపం చూపించున్నాడు. మే 18న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఓవెన్ ఆడే అవకాశముంది.
Punter setting the tone 🗣️ pic.twitter.com/KXbXOVknlw
— Punjab Kings (@PunjabKingsIPL) May 15, 2025