నీలగిరి, మే 15 : తీవ్ర అస్వస్థతకు గురై నల్లగొండలోని ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్త, తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందినం తగుళ్ల వెంకన్నను గురువారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకన్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన మెరుగైన చికిత్స అందించాలని కోరారు. వెంకన్నకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, బీఆర్ఎస్ తిప్పర్తి నేతలు కందుల లక్ష్మయ్య, తగుళ్ల శ్రీను ఉన్నారు.