Super Star | మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. మోహన్ లాల్ తెలుగులో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. అయితే మోహన్ లాల్ ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఇటీవల ఆయన సినిమాలు కూడా పలు రికార్డులు సాధించాయి. అయితే మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా తయారు చేసిన కేక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సూపర్ స్టార్ బర్త్ డే కేక్ విలువ అక్షరాలాల రూ.465 కోట్లు కాగా, ఇది విని అందరు ఆశ్చర్యపోతున్నారు.
కేక్ ధర అంతనా, అంత స్పెషాలిటీ ఏంటని అందరు నోరెళ్లపెడుతున్నారు. అయితే విషయం ఏంటంటే.. కేక్ పై మోహన్ లాల్ రెండు సినిమాల వసూళ్లను అధికారికంగా ప్రదర్శించింది టీమ్. రెండిటినీ కలుపుకుంటే, అంత పెద్ద సంఖ్య నమోదైంది. ఎల్ 2 వసూళ్లు 265 కోట్లు, తుడరమ్ వసూళ్లు 200 కోట్లు కలుపుకుని మోహన్ లాల్ సంపాదించినది 465 కోట్లు అన్నమాట. ఈ వయస్సులోను బాక్సాఫీస్‌ని ఆ రేంజ్లో షేక్ చేసే సత్తా మోహన్ లాల్‌కే ఉందనడంలో అతిశయోక్తి లేదు. బాలీవుడ్ లో ఖాన్లు, బచ్చన్లు సాధించలేని వసూళ్లు ఆయన సినిమాలకి సాధించి చూపించాడు.
ఈసారి ఆయన బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఒకదానిపై ఒకటిగా జత చేసి రెండు కేక్ లతో డబుల్ ధమాకా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేసారు. మోహన్ లాల్ కు డబుల్ విజయం దక్కిన నేపథ్యంలో రెండు అంచెల కేక్‌తో సెలబ్రేట్ చేశారు. కేక్ చూసి మోహన్ లాల్ కూడా ఫుల్ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది. ఇక మోహన్ లాల్ నటించిన L2: ఎంపురాన్ లో స్టీఫెన్ నేడుంపల్లిగా, తుడారుమ్ లో బెంజ్ గా (వ్యంగ్య పాత్ర) అతడు సత్తా చాటాడు. ఉత్కంఠభరితమైన ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన `తుడారుమ్` బంపర్ హిట్ వసూళ్లతో అదరగొట్టింది. ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకులను ఆకట్టుకుని, రూ. 200 కోట్లు వసూలు చేసింది.