IPL 2025 : సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు పెద్ద షాక్. ఆ జట్టు ప్రధాన పేసర్ లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. ఉప్పల్ మైదానంలో బౌలింగ్ చేస్తుండగా కండరాల నొప్పితో ఫెర్గూస్ మైదానం వీడాడు. అయితే.. ఈ స్పీడ్‌స్టర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలియదని అంటోంది పంజాబ్ యాజయాన్యం. దాంతో, పంజాబ్ తర్వాతి మ్యాచ్‌లకు ఈ పేస్ గన్ దూరమయ్యే అవకాశం ఉంది.
‘ఫెర్గూసన్ మళ్లీ జట్టుతో కలిసి మైదానంలోకి దిగేది ఎప్పుడనేది చెప్పలేం. కనీసం ఆఖరి మ్యాచ్‌లకు అయినా అతడు అందుబాటులో ఉండడం అసాధ్యం అనిపిస్తోంది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఫెర్గూసన్ పెద్ద గాయమే చేసుకున్నాడు’ అని సోమవారం పంజాబ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ వెల్లడించాడు. ఈ సీజన్లో 4 మ్యాచుల్ ఆడిన ఈ కివీ పేసర్ 5 వికెట్లు పడగొట్టాడు. అతడికి ప్రత్యామ్నాయంగా గ్జావియర్ బార్ట్లెట్, అజ్మతుల్లా ఒమర్జాయ్‌ల పేర్లను పరిశీలిస్తోందని సమాచారం.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Big blow for PBKS! 😕
PBKS fast bowling coach James Hopes confirms that Lockie Ferguson’s injury is big, and there’s very little chance he’ll be fit for the remainder of IPL 2025 ❌👀#LockieFerguson #IPL2025 #PBKS #Sportskeeda pic.twitter.com/2cJuUygoEz
— Sportskeeda (@Sportskeeda) April 14, 2025
ఉప్పల్ మైదానంలో హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో 6వ ఓవర్ వేస్తుండగా ఫెర్గూసన్.. ఎడమ కాలి కండరాలు పట్టేశాయి. దాంతో పూర్తి ఓవర్ వేయలేకపోయాడు. అందువల్ల స్టోయినిస్ ఆ ఓవర్ పూర్తి చేయాల్సి వచ్చింది. నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడిన ఫెర్గూసన్‌కు పరీక్షలు నిర్వహించగా.. కండరాల గాయం నుంచి కోలుకునేందుకు సమయం పట్టనుందని డాక్టర్లు చెప్పారు. కాబట్టి.. ఫెర్గూసన్ విశ్రాంతి తీసుకోనున్నాడు.
🚨 BREAKING: PBKS fast bowling coach James Hopes on Lockie Ferguson’s injury: “He’s out indefinitely, with a very low chance of returning by the tournament’s end. I think he’s done a real decent injury to himself.” 🏏 #PBKS #IPL #CricketNews #IPL2025 #Punjabkings pic.twitter.com/24oV3OdUgo
— Harinder singh brar (@harry7081) April 14, 2025