IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ వేలంలో రికార్డు ధర పలికిన రిషభ్ పంత్(63) అర్ధ శతకంతో మెరిశాడు. చెన్నై సూపర్ కింగ్స్(CSK)బౌలర్లపై విరుచుకుపడ్డ అతడు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో లక్నోసూపర్ జెయింట్స్‌కు భారీ స్కోర్ అందించాడు. ఈ ఎడిషన్‌లో జెయింట్స్ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలుస్తున్న మిచెల్ మార్ష్(30), నికోలస్ పూరన్(8)లు విఫలం కాగా.. పంత్ ఒంటరిపోరాటంతో ఆకట్టుకున్నాడు. ఆయుష్ బదొని(22), అబ్దుల్ సమద్(20)లతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. పథిరన(2-45) ఆఖరి ఓవర్లో కేవలం 10 రన్స్ రావడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.
టాస్ ఓడిన లక్నోకు చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(6) కొట్టిన బంతిని రాహుల్ త్రిపాఠి క్యాచ్ అందుకోవడంతో 6 పరుగులకే తొలి వికెట్ పడింది. ఆ కాసేపటికే డేంజరస్ నికోలస్ పూరన్(8) ను అన్షుల్ కంబోజ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూ తీసుకొని మరీ వికెట్ సాధించింది సీఎస్కే.
Innings Break!
Captain Pant guides #LSG to a competitive score of 166/7 👏#CSK chase on the other side ⏳
Scorecard ▶ https://t.co/jHrifBkT14 #TATAIPL | #LSGvCSK pic.twitter.com/aRlj333yWb
— IndianPremierLeague (@IPL) April 14, 2025
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్(63).. జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌తో సిక్సర్ సాధించాడు. దాంతో, లక్నో స్కోర్ 50 దాటింది. అయితే.. మార్ష్‌ను జడేజా బౌల్డ్ చేశాడు. ఆయుషబ్ బదొని ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. ఓవైపు నూర్ అహ్మద్.. డాట్ బాల్స్ వేస్తూ ఒత్తిడి పెంచారు. బౌండరీలు రావడం గగనమైన వేళ అతడు జడ్డూ బౌలింగ్‌లో ధోనీ స్టంపింగ్‌తో వెనుదిరిగాడు. ఒకదశలో లక్నో స్కోర్ 130 చేరడం కష్టమనిపించింది.
అయితే.. 17వ ఓవర్ తర్వాత సీన్ మారిపోయింది. అబ్దుల్ సమద్(20) సిక్సర్ బాదగా.. పథిరన వేసిన 18 ఓవర్లో పంత్ రెచ్చిపోయాడు. తొలి బంతిని అలవోకగా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత డబుల్స్.. ఒంటిచేత్తో బంతిని స్టాండ్స్‌లోకి పంపి ఈ ఎడిషన్‌లో తొలి అర్థ శతకం సాధించాడు. ఖలీల్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. చివరి బంతిని సమద్ లెగ్ సైడ్‌లో స్టాండ్స్‌లోకి తరలించగా లక్నో స్కోర్ 150కి చేరింది. 20 ఓవర్లో ధోనీ త్రోతో సమద్ రనౌట్ కాగా.. టైమింగ్ కుదరక పంత్ ఆడిన బంతి గాల్లోకి లేవగా ధోనీ క్యాచ్ అందుకున్నాడు. శార్దూల్ ఠాకూర్(4) బౌండరీ కొట్టగా లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
𝘾𝙖𝙥𝙩𝙖𝙞𝙣 𝙋𝙖𝙣𝙩𝙖𝙨𝙩𝙞𝙘 🫡#LSG skipper brings up his maiden fifty of the season 🔥
Pick your favourite between these two specials? 🚁
Updates ▶ https://t.co/jHrifBkT14 #TATAIPL | #LSGvCSK | @RishabhPant17 pic.twitter.com/GiMky62KXP
— IndianPremierLeague (@IPL) April 14, 2025