DC vs PBKS : పంతొమ్మిదో సీజన్లో ఓటమెరుగని పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఐపీఎల్ చరిత్రను తిరగరాసింది. ప్రత్యర్థి మారినా, లక్ష్యం ఎంతైనా సరే అలవోకగా ఛేదిస్తున్న పంజాబ్ ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఉఫ్మనిపించి రికార్డు నెలకొల్పింది. కేఎల్ రాహుల్(152 నాటౌట్) సెంచరీతో 265 పరుగుల సవాల్ విసిరిన ఢిల్లీకి షాకిస్తూ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(76), ప్రియాన్ష్ ఆర్య(43)లు ఆకాశమే హద్దుగా చెలరేగి విజయానికి బాటలు వేశారు. స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు పడినా.. శ్రేయాస్ అయ్యర్(71 నాటౌట్) మరోమారు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఆరు వికెట్లతో విక్టరీ కొట్టని పంజాబ్ 13 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
ఐపీఎల్-19లో పంబాజ్ కింగ్స్ ధాటికి రికార్డులు బద్ధలైపోతున్నాయి. ఎదురైన ప్రత్యర్ధినల్లా ఓడిస్తున్న పంజాబ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని కరిగించేసి రికార్డు పట్టేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్‌తో గెలుపుపై ధీమాతో ఉండగా.. మేము ఎంతైనా కొట్టేస్తామంటూ పంజాబ్ హిట్టర్లు జట్టుకు ఆరో విజయాన్ని కట్టబెట్టారు.
Stylish and Impactful 😎
Shreyas Iyer leading #PBKS to something special 👏
A fine FIFTY in the chase by the skipper 🫡
Updates ▶️ https://t.co/0oSkMZgNAV#TATAIPL | #KhelBindaas | #DCvPBKS | @PunjabKingsIPL | @ShreyasIyer15 pic.twitter.com/ilasVIGXXJ
— IndianPremierLeague (@IPL) April 25, 2026
రికార్డు ఛేదన కావడంతో తొలి నాలుగు ఓవర్లలో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(43), ప్రభ్‌సిమ్రన్ సింగ్(76)లు ఇరగమరగ దంచేశారు. నబీ వేసిన తొలి ఓవర్లో చెరొక సిక్సర్ బాదిన .. ఆపై ముకేశ్ కుమార్ ఓవర్లో తలొక సిక్సర్‌తో ఢిల్లీకి హడలెత్తించారు. అక్షర్ పటేల్‌ను ఉతికేసిన ప్రియాన్స్ 4, 6, 6తో ఇవరై రన్స్ పిండుకున్నాడు. అయితే.. ఉతుకుడే మంత్రగా సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయాన్ని అక్షర్ విడదీసి ఢిల్లీకి బ్రేకిచ్చాడు.
You set the target. We set the rules. 💥 pic.twitter.com/sctypOmMSO
— Punjab Kings (@PunjabKingsIPL) April 25, 2026
అనంతరం కుల్దీప్ యాదవ్(2-46) వరస ఓవర్లలో ప్రభ్‌సిమ్రన్, కూపర్ కొన్నొల్లీను ఔట్ చేసి పంజాబ్‌ను ఒత్తిడిలో పడేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(71 నాటౌట్), ఇంప్యాక్ట్ సబ్ నేహల్ వధేరా(17)లు.. బాధ్యత తీసుకున్నారు. విప్రజ్ నిగమ్ ఓవర్లో వధేరా ఔటైనా దూకుడు తగ్గించని అయ్యర్ కుల్దీప్ ఓవర్లో వరసగా రెండు సిక్సర్లు బాది ఈ సీజన్లో మూడో అర్ధ శతకం సాధించాడు. అంతే.. కొండంత లక్ష్యం చూస్తుండగానే మంచుముక్కలా కరిగిపోయింది. నట్టూ వేసిన 19వ ఓవర్లో శశాంక్ సింగ్(19 నాటౌట్) ఫోర్, అయ్యర్ సిక్సర్ బాదగా మరో ఓవర్ ఉండగానే ఆరు వికెట్లతో పంజాబ్ జయభేరి మోగించింది.
సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్(152 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి శతకంతో గర్జించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిమానులను బౌండరీల వర్షంలో మంచెత్తిన రాహుల్ పంజాబ్ కింగ్స్ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు.

పటిష్టమైన పంజాబ్ బౌలింగ్ దళాన్ని తుత్తునియలు చేసిన రాహుల్.. రెండో వికెట్‌కు నితీశ్ రానా(91)తో కలిసి 220 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నిగ్స్ ఆఖరి ఓవర్లో బౌండరీ ఢిల్లీ భారీ స్కోరందించాడు.