ముంబై: పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తప్పనిసరి ఏడు రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాడు. క్వారంటైన్ పూర్తైన ఆనందంలో యూనివర్స్ బాస్ హోటల్ రూమ్‌లోనే స్టెప్పులేశాడు. దిగ్గజ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ రూపొందించిన సూపర్ హిట్ సాంగ్ ‘స్మూత్ క్రిమినల్’కు గేల్ మూన్ వాక్ డ్యాన్స్ చేశాడు. గేల్ చిందులేస్తుండగా తీసిన వీడియోను పంజాబ్ ట్విటర్లో షేర్ చేసింది. క్వారంటైన్‌లోనూ గేల్ జిమ్‌లో వర్కౌట్లు చేశాడు. అప్పుడప్పుడూ పంజాబీ పాటలకు తనదైన స్టైల్లో చిందులేస్తూ కాలక్షేపం చేశాడు.
పంజాబ్ కింగ్స్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ గేల్ ఈసారి కూడా మూడో నంబర్లో బ్యాటింగ్‌కు రానున్నాడు. గతేడాది చివరి ఏడు గేమ్‌ల్లో ఆడిన గేల్ 288 పరుగులు సాధించాడు. క్యాష్‌రిచ్ లీగ్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ వీరుడి పేరిట ఉంది. పంజాబ్ తన తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
Quarantine da khatam khel, bahar aa gaye tuhadde favourite – Chris Gayle 🕺🥰#IPL2021 #SaddaPunjab #PunjabKings @henrygayle pic.twitter.com/rrDHPZ3lvQ
— Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2021
Wack We a Wack! #Quarantine #India #IPL #PunjabiDaddy pic.twitter.com/Ni0BvIYI35
— Chris Gayle (@henrygayle) April 6, 2021