చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్‌ను విజయంతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములతో ఢీలా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన పంజాబ్ అద్బుత విజయం సాధించింది. 132 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(60 నాటౌట్: 52 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకానికి తోడు క్రిస్‌గేల్(43 నాటౌట్: 35 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) మెరవడంతో 9 వికెట్లతో గెలుపొందింది. ఆరంభంలో మయాంక్ అగర్వాల్(25) శుభారంభం అందించాడు.
అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ(63: 52 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. రోహిత్ ఒంటరి పోరాటం చేయడంతో ముంబై ఆమాత్రం స్కోరైనా చేసింది. సూర్యకుమార్ యాదవ్(33: 27 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) ఫర్వాలేదనిపించాడు. క్వింటన్ డికాక్(3), ఇషాన్‌కిషన్(6), హార్దిక్ పాండ్య(1) మరోసారి నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లు కళ్లుచెదిరే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. రవి బిష్ణోయ్(2/21), దీపక్ హుడా(1/15),హెన్రిక్స్(0/12) ముంబైని కట్టడి చేశారు.
The Universe Boss takes the aerial route and hits a biggie!
— IndianPremierLeague (@IPL) April 23, 2021
Live – https://t.co/oSv9pZERHc #PBKSvMI #VIVOIPL pic.twitter.com/IOL67ebATB
And that's that from Chennai.
— IndianPremierLeague (@IPL) April 23, 2021
(60*) from @klrahul11 and 43* from Chris Gayle as #PBKS win by 9 wickets against #MI.
Scorecard – https://t.co/KCBEyHFVDN #VIVOIPL pic.twitter.com/oWfcCxhOmX