Shreyas Iyer : భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్యంపై అప్డేట్ వచ్చింది. సిడ్నీ వన్డేలో త్రీవంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందిన అయ్యర్ తాజాగా సహచరుడి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నాడు. ఈ పార్టీకి హాజరైన పంజాబ్ కింగ్స్ సహయజమాని ప్రీతి జింతా తమ సారథి ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. వేగంగా కోలుకుంటున్నాడని చెప్పింది. పంజాబ్ స్టార్ శశాంక్ సింగ్ బర్త్‌డే సందర్భంగా అయ్యర్.. ఐపీఎల్ టీమ్మేట్స్తో కలిసిన ఫొటోను ఎక్స్ పోస్ట్‌లో పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ.
సిడ్నీలో ఆపరేషన్ చేయించుకున్న అయ్యర్ ఈ మధ్యే భారత్‌కు వచ్చాడు. గాయం నుంచి కోలుకుంటున్న అతడు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే.. పంజాబ్ కింగ్స్ సభ్యుడు శశాంక్ సింగ్ బర్త్ డే ఉండడంతో అతడిని విష్ చేసేందుకు అయ్యర్ అలా బయటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ప్రీతి జింతా.. మరికొందరితో అతడు ఫొటోలు దిగాడు. ఆ ఫొటోనే ప్రీతి సోషల్ మీడియాలో పెట్టింది.
Sometimes the most Unplanned and Impromptu evenings are the best. Happy Birthday Shashank once again. So happy to see you and so happy to see Shreyas recovering well and coming out ( for once 🤩) Thank you Rohini for always being awesome ❤️ Loved bumping into Dino as always 🤩… pic.twitter.com/hhc1XLdYie
— Preity G Zinta (@realpreityzinta) November 22, 2025
‘కొన్నిసార్లు ప్రణాళిక వేసుకోని సాయంత్రాలే చాలా బాగుంటాయి. హ్యాపీ బర్త్‌డే శశాంక్. వేగంగా కోలుకుంటున్న అయ్యర్ బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్యూ రోహిణి, డినో. పాత స్నేహితులను కలుసుకోవడం.. కొత్త వాళ్లను ఫ్రెండ్స్ చేసుకోవడం చాలా బాగుంది’ అని ప్రీతి క్యాప్షన్ రాసుకొచ్చింది. శశాంక్ బర్త్ డే కోసం బయటకు వచ్చిన అయ్యర్ ఒక అభిమాని తీరుతో చిరాకుపడిన వీడియో నెట్టింట వైరలైంది. సెల్ఫీ కోసం సదరు ఫ్యాన్ తనకు దగ్గరరావడంతో భారత స్టార్ తనన భద్రతా సిబ్బందిపై కోప్పడ్డాడు. తన ఆరోగ్యం దృష్ట్యా అతడు సెక్యూరిటీని బ్రదర్.. అభిమానులు ఎవరూ దగ్గరికి రాకుండా చూసుకోవడం మీ బాధ్యత అని సున్నితంగా వారించాడు.

ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్‌ను ఫైనల్ చేర్చిన అయ్యర్.. కప్ కలను మాత్రం నిజం చేయలేకపోయాడు. దాంతో.. ఈసారి ఫ్రాంచైజీకి ట్రోఫీ అందించాలనే పట్టుదలతో ఉన్నాడతడు. గాయం నుంచి కోలకుంటున్ను అయ్యర్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ మైదానంలో జరిగిన మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయపడ్డాడు. హర్షిత్ రానా ఓవర్లో అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని అయ్యర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. సూపర్ క్యాచ్ పట్టిన అతడు.. ఆ తర్వాత నొప్పితో విలవిలలాడాడు. దాంతో, ఫీజియో వచ్చి పరీక్షించాడు.. అయినా ఉపశమనంగా లేకపోవడంతో అయ్యర్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. స్కానింగ్ పరీక్షల్లో అతడి ప్లీహం దెబ్బతిన్నట్టు తేలింది. దాంతో.. సిడ్నీలోనే ఆపరేషన్ చేయించున్న అయ్యర్.. అక్కడే కొన్నిరోజులు ఉండి.. భారత్‌కు తిరిగొచ్చాడు.