Chateshwar Pujara : టెస్టులకు దూరమైన భారత క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా (Chateshwar Pujara) మళ్లీ మైదానంలోకి వస్తున్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు వీడ్కోలు పలికిన తర్వాత జాతీయ జట్టులో చోటు ఆశించి భంగపడిన ‘నయావాల్’ రంజీ ట్రోఫీ దృష్టి సారించాడు. ఇంగ్లండ్ పర్యటన సమయంలో విశ్లేషకుడిగా మెప్పించిన పుజారా మళ్లీ తన బ్యాట్ పవర్ చూపించేందుకు సిద్దమవుతున్నాడు.
త్వరలో మొదలయ్యే రంజీ సీజన్ 2025-26లో అతడు సౌరాష్ట్ర (Saurashtra) తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయంపై గురువారం స్పందించిన సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (SCA) తమకు పుజారా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిపింది. ‘పుజారా దిగ్గజ ఆటగాడు. రంజీల్లో అతడికి గొప్ప రికార్డు ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతడి అనుభవం మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది’ అని ఎస్సీఏ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించాడు.
Cheteshwar Pujara has reportedly committed to another Ranji Trophy season for Saurashtra, even as his international comeback hopes fade away.#RanjiTrophy #CheteshwarPujara pic.twitter.com/DIljOrJOVi
— Circle of Cricket (@circleofcricket) August 21, 2025
దేశవాళీలో రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్‌లతో చెలరేగిన పుజారా 2023లో టెస్టు జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత రంజీల్లో శతకాలతో మెరిసి.. పునరాగమనం కోసం ఎదురుచూసినా సెలెక్టర్లు మాత్రం అతడిపై కరుణ చూపలేదు.ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్, కోహ్లీ రిటైర్ అవడంతో తనకు ఛాన్స్ వస్తుందని పుజారా ఊహించాడు. కానీ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం కుర్రాళ్లకే పట్టం కట్టారు. మూడో స్థానంలో సాయి సుదర్శన్(Sai Sudarshan)ను ఆడించి నయా వాల్ ఆశలపై నీళ్లు చల్లారు.
Thoroughly enjoyed calling what has been an enthralling series over the last 6 weeks!
Has been great working with the @SonySportsNetwk and @bbctms teams. Hope you’ll enjoyed what we tried to bring to you’ll from the ground!
Nothing quite like Test Cricket 🙂#ENGvIND pic.twitter.com/r1YCGdV2oI
— Cheteshwar Pujara (@cheteshwar1) August 5, 2025
క్రికెట్ ఆడాలని ఉన్నంత కాలం జాతీయ జట్టుకు అయినా.. దేశవాళీ జట్టుకు అయినా ప్రాతినిధ్వం వహించేందుకు సిద్ధమేనని ప్రకటించిన పుజారా వచ్చే రంజీ ట్రోఫీలో రఫ్ఫాడించనున్నాడు. నిరుడు ఏడు మ్యాచుల్లో 40 సగటుతో 402 రన్స్ కొట్టాడు. అయితే.. ఫిబ్రవరిలో రంజీ సీజన్ ముగిశాక అతడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయలేదు. కౌంటీల్లో ఆడే అవకాశం వచ్చినా.. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో కామెంటేటర్‌గా వ్యవహరించి ఫ్యాన్స్‌ను అలరించాడీ వెటరన్. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా పేరొందిన పుజారా సుదీర్ఘ ఫార్మాట్లో 103 మ్యాచులు ఆడి 7,195 పరుగులు సాధించాడు.