Duleep Trophy : వెస్ట్ జోన్(West Zone) జట్టు దులీప్ ట్రోఫీ(Duleep Trophy) ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఈరోజు సెంట్రల్ జోన్ జట్టును చిత్తుగా ఓడించింది. వెస్ట్ జోన్ విజయంలో ఛతేశ్వర్ పూజారా( Cheteshwar Pujara), పేసర్ అర్జాన్ నగస్వల్లా(Arzan Nagaswalla) కీలక పాత్ర పోషించారు. ఆఖరి రోజు వర్షం పడడండో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే.. తొలి ఇన్నింగ్స్లో 98 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన వెస్ట్ జోన్ ఫైనల్కు దూసుకెళ్లింది. జూలై 12న జరగనున్న టైటిల్ పోరులో ఈ జట్టు సౌత్ జోన్(South Zone), నార్త్ జోన్(North Zone) మ్యాచ్ విజేతతో తలపడనుంది.
వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)కు సెలెక్టర్లు వేటు వేయడంతో షాక్ తిన్న పుజారా దేశవాళీలో సత్తా చాటుతున్నాడు. వెస్ట్ జోన్ తరఫున అతను కీలకమైన సెమీ ఫైనల్లో సెంచరీతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్లో 278 బంతుల్లో 133 పరుగులతో జట్టను ఆదుకున్నాడు. దాంతో వెస్ట్ జోన్ 339 రన్స్ కొట్టింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో వెస్ట్ 220కి ఆలౌటయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జట్టును పేసర్ అర్జాన్ నగస్వల్లా (Arzan Nagaswalla) 5 వికెట్లతో దెబ్బకొట్టాడు. అతడి ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది.
సెంట్రల్ జట్టును 5 వికెట్లతో దెబ్బకొట్టిన అర్జాన్ నగస్వల్లా

రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులకే ఓపెనర్లు వివేక్ సింగ్, హిమాన్షు మంత్రి పెవిలియన్ చేరారు. ఆఖరి రోజు వర్షం పడే సమయానికి సెంట్రల్ జట్టు 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లు హిమాన్షు మంత్రి, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్(Rinku Singh) పెవిలియన్ చేరారు. ఐపీఎల్ పదహారో సీజన్లో సిక్సర్ల మోత మోగించిన రింకూ వెస్ట్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 30 బంతుల్లోనే 40 రన్స్ చేసిన అతడు కూడా ఔట్ కావడంతో సెంట్రల్ జట్టు కష్టాల్లో పడింది.