RCB Fans : ఐపీఎల్ 19వ సీజన్లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) విజేతగా నిలవడంతో ఆ జట్టు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. అయితే.. కొందరు అభిమానులు మాత్రం అతి చేష్టలతో పోలీసుల చేతికి చిక్కారు. ఆర్సీబీ గెలుపొందగానే అర్ధ రాత్రి రోడ్ల మీదకొచ్చి బస్సుల అద్దాలు పగలగొట్టి నానా హంగామా చేసిన వారిని కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హద్దు మీరిన ఆ ఫ్యాన్స్‌కు బుద్ధి వచ్చేలా పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకూ రోడ్డు మీద నడిపించారు.
ఆర్సీబీ వరసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడంతో కొందరు అభిమానులు కర్నూలులో రోడ్లమీదకొచ్చి సంబురాలు చేసుకున్నారు. బెంగళూరు విజయం అనంతరం భారీ సంఖ్యలో రోడ్ల మీదకొచ్చిన ఫ్యాన్స్.. కొందరు మూడు ప్రైవేటు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. అంతేకాదు రోడ్డుపై ఉన్న బారీకేడ్లను కిందపడేసి నానా హంగామా చేశారు. బస్సుల అద్దాలు పగలగొట్టి.. బారీకేడ్లను కింద పడేసి రచ్చ చేసిన 18 మందిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అర్ధ రాత్రిపూట హద్దు మీరి ప్రవర్తించిన వారికి బుద్ధి చెప్పడం కోసం పోలీసు స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిరోడ్డుపై నడిపించి తీసుకెళ్లారు.
కర్నూలులో రోడ్ల మీద విధ్వంసం సృష్టించిన ఆర్సీబీ అభిమానులకు బుద్ధి చెప్పిన పోలీసులు
సంబరాలు చేసుకునే క్రమంలో మూడు ప్రైవేటు బస్సుల అద్దాలను ధ్వంసం చేసి, రోడ్డుపై ఉన్న బారికేడ్లను కిందపడేసిన 18 మందిని సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు
వారికి బుద్ధి చెప్పడం కోసం పోలీసు స్టేషన్ నుంచి… https://t.co/5UNsmr3I5S pic.twitter.com/oyYkE6AfHP
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026