French Open : భారత డబుల్స్ ఆటగాడు ఎన్.శ్రీరామ్ బాలాజీ(N Sriram Balaji) ఫ్రెంచ్ ఓపెన్‌లో దూసుకెళ్తున్నాడు. మార్సెలో డెమొలినర్(బ్రెజిల్)తో జోడీ కట్టిన బాలాజీ అదిరే ఆటతో క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు. సోమవారం జరిగిన మూడో రౌండ్లో ఈ ద్వయం ఆరో సీడ్‌కు షాకిచ్చి ముందంజ వేసింది. జూనియర్ పోటీల పురుషుల సింగిల్స్ భారత్‌కు చెందిన ఆర్ణవ్ పపర్కర్ 16వ రౌండ్‌కు అర్హత సాధించాడు. కానీ, యుకీ బాంబ్రీ జంటకు డబుల్స్‌లో ఓటమి ఎదురైంది.
ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో శ్రీరామ్ బాలాజీ జోరు చూపిస్తున్నాడు. పురుషుల డబుల్స్‌లో మార్సెలో డెమొలినర్తో కలిసి వరసగా మూడో విజయంతో క్వార్టర్ ఫైనల్ చేరాడు. సోమవారం ఆరో సీడ్ కెవిన్ క్రవిట్జ్ – టిమ్ పుయెట్జీ జంటను చిత్తు చేసింది బాలాజీ – మార్సెలో జోడీ.
Sriram Balaji and Marcelo Demoliner upset the No. 6 seeds to storm into the next round at Roland-Garros 💪#SonySportsNetwork #RolandGarros #RG2026 #SonyLIV pic.twitter.com/R0zNZozuFj
— Sony Sports Network (@SonySportsNetwk) June 1, 2026
తొలి సెట్ నుంచి ఆధిపత్యం చెలాయించి 7-5, 6-4తో వరస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించి క్వార్టర్స్ చేరింది బాలాజీ – మార్సెలో జోడీ. మరో మ్యాచ్‌లో యుకీ బాంబ్రీ – మైఖేల్ వీనస్(న్యూజిలాండ్) ద్వయం అనూహ్యంగా కంగుతిన్నది. ఇటలీ జంట సొమొనె బొలెల్లీ – అండ్రీయ వవస్సోరి చేతిలో 3-6, 4-6తో ఓటమి పాలైంది.