PKL | న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పది ఎడిషన్ల ద్వారా క్రీడాభిమానులకు దగ్గరైన పీకేఎల్ సరికొత్త ఉత్సాహంతో ముందుకు రాబోతున్నది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా అక్టోబర్ 18 నుంచి పీకేఎల్ సీజన్‌కు తెరలేవనుంది.
లీగ్ షెడ్యూల్‌ను నిర్వాహకులు సోమవారం విడుదల చేశారు. తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.