INDA vs PAKA : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో పాకిస్థాన్ ఏ బౌలర్లను ఉతికేస్తున్న భారత ఏ ఓపెనర్ల జోరుకు బ్రేక్ పడింది. ఆరంభం నుంచి టైమింగ్ కుదరక ఇబ్బంది పడుతున్న ప్రియాన్ష్ ఆర్య(10) ఔటయ్యాడు. అజిజ్ ఓవర్లో భారీ షాట్ ఆడాలనుకున్న అతడు టైమింగ్ కుదరక క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో.. నాలుగో ఓవర్లో 30 పరుగుల వద్ద భారత ఏ మొదటి వికెట్ పడింది. ప్రస్తుతం ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(24 నాటౌట్), నమన్ ధిర్(6 నాటౌట్) ఆడుతున్నారు. 5 ఓవర్లకు స్కోర్.. 40-1.
దోహా వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత ఏ జట్టుకు శుభారంభం లభించింది. యూఏఈపై 32 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన స్టార్ వైభవ్ సూర్యవంశీ(24 నాటౌట్) పాక్ బౌలర్లను వణికిస్తూ బౌండరీలు బాదేస్తున్నాడు. తొలి బంతినే బౌండరీకి పంపిన ఈ చిచ్చరపిడుగు.. రెండో ఓవర్ చివరి రెండు బంతులను ఫోర్, సిక్స్‌గా మలిచాడు. మూడో ఓవర్లో బౌండరీ బాదిన ప్రియాన్ష్.. నాలుగో ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టాడు. అదే ఊపులో షాట్ ఆడబోయిన అతడు.. టైమింగ్ మిస్ అయ్యి మిడాఫ్‌లో సులువైన క్యాచ్ ఇచ్చాడు.
Shahid Aziz gets the better of Priyansh Arya and gives Pakistan A the early breakthrough. ☝🏼
India lose their first wicket. ❌#RisingStarsAsiaCup #INDAvsPAKA #Sportskeeda pic.twitter.com/OwXKA4jtRU
— Sportskeeda (@Sportskeeda) November 16, 2025
𝐑𝐚𝐫𝐢𝐧𝐠 𝐭𝐨 𝐠𝐨 𝐟𝐨𝐫 𝐆𝐚𝐦𝐞 2⃣💪
📍 Doha
⏰ 8:00 PM IST
💻 https://t.co/hIL8Vefajg
📱 Official BCCI AppGood luck to India A for their next challenge in the #RisingStarsAsiaCup 👌 pic.twitter.com/zWwvC91QaG
— BCCI (@BCCI) November 16, 2025