ఇక మహిళల 10 వేల మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక 43:38.83 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజత పతకం ఖాతాలో వేసుకుంది. జెమీమా (42:34.30; ఆస్ట్రేలియా), ఎమిలీ (43:50.86; కెన్యా) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో పోటీ పడ్డ మరో భారత అథ్లెట్ భావన (47:14.13) ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ‘రేస్ వాక్ మహిళల విభాగంలో దేశానికి తొలి పతకం అందించడం చాలా ఆనందంగా ఉంది’ అని విజయం అనంతరం ప్రియాంక పేర్కొంది.