లక్నో: ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డే(Ind vs Afg)లో.. భారత జట్టులోకి ప్రిన్స్ యాదవ్ వచ్చేశాడు. ఇవాళ తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్పులు చేశారు. ప్రిన్స్ యాదవ్ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. తొలి వన్డేలో ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. వర్షం వల్ల 25 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో గిల్ సేన ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. రెండో వన్డేకు ప్రసిద్ధ కృష్ణ, శివం దూబే, నితీశ్ రెడ్డిలకు చోటు దక్కలేదు. ఎడమ తొడలో నొప్పి వల్ల నితీశ్ రెండో వన్డే ఆడడంలేదు. అతని ఆరోగ్య పరిస్థితిని మెడికల్ టీం పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.
🚨 Toss 🚨
Afghanistan have won the toss and elected to bowl in the 2⃣nd ODI.
Updates ▶️ https://t.co/JYJ5l44iJ6#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/SytPh2cKsV
— BCCI (@BCCI) June 17, 2026