Droupadi Murmu | పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడాకారులను కలిసిన ఆమె.. వారితో ముచ్చటించారు. ఇటీవల పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాలు సాధించింది. అనంతరం బృందం భారత్‌కు జరిగింది. రాష్ట్రపతి భవన్లో సమావేశంలో పతక విజేతలు మను భాకర్, పీఆర్ శ్రీజేశ్లతో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇద్దరు క్రీడాకారులు పతకాల వేటలో తమ ప్రయాణాన్ని వివరించారు. ఆతిథ్యం ఇచ్చినందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భాగమని.. ఈ సారి సైతం ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గినందుకు ప్రత్యేకమైందని పీఆర్ శ్రీజేశ్ రాష్ట్రపతితో తెలిపారు. ఈ సారి కాంస్య పతకం కాకుండా.. మరో పతకం సాధించాలనుకున్నామని.. దురదృష్టవశాత్తు జర్మనీపై సెమీఫైనల్లో ఓడిపోయామని.. తాము చేయగలిగినంత వరకు చేశామని.. ఉత్త చేతులతో కాకుండా ఏదో ఒక పతకంతో దేశానికి తిరిగి రావాలని కోరుకున్నామని చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధం అయ్యేందుకు అన్ని వసతులు సమకూర్చిన భారత ప్రభుత్వం, భారత ఒలింపిక్స్ సంఘం సమకూర్చిందని. లేకపోతే పతకాలు సాధ్యమయ్యేవి కావని.. భారతీయుడిగా గర్విస్తున్నామని గర్వంగా చెప్పగలనని శ్రీజేశ్ పేర్కొన్నారు.
President Droupadi Murmu met the Indian Contingent of the Paris Olympics 2024 at Ganatantra Mandap, Rashtrapati Bhavan. The President congratulated the players for their excellent efforts and great performance; and said that they are a source of inspiration for all the youth of… pic.twitter.com/iUequ3kd8y
— President of India (@rashtrapatibhvn) August 14, 2024