హైదరాబాద్, ఆట ప్రతినిధి: కోల్‌కతా వేదికగా జరిగిన రెండవ ఆసియా చెస్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌తో పాటు 3వ ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ తక్కడపల్లి ప్రతిభ సత్తాచాటింది. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన ప్రతిభ ఐదు స్వర్ణాలు సహా ఒక రజత పతకంతో మెరిసింది.
మరోవైపు సబ్‌జూనియర్ విభాగంలో బాన్సువాడకు చెందిన రుషాంక్రెడ్డి రెండు స్వర్ణాలు, విజయ్ రాఘవేంద్రరావు రెండు రజత పతకాలు సాధించారు.