Vizag ODI : రాయ్‌పూర్ వన్డేలో తేలిపోయిన భారత బౌలర్లు వైజాగ్‌లో చెలరేగారు. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా హిట్టర్ల జోరుకు కళ్లెం వేశారు. ప్రసిధ్ కృష్ణ(4-66) టాపార్డర్‌ను దెబ్బకొట్టగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4-41) మిడిలార్డర్‌ను పడగొట్టి సఫారీలకు షాకిచ్చాడు. ఒకే ఓవర్లో డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్(29), మార్కో యాన్సెన్(17)లను ఔట్ చేసి భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు కుల్దీప్. ఓపెనర్ క్వింటన్ డికాక్(106) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ తెంబా బవుమా(48) రాణించగా ప్రొటీస్ టీమ్ 270కి ఆలౌటయ్యింది.
సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాను ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే యువ పేసర్ అర్ష్‌దీస్ సింగ్(1-30) దెబ్బకొట్టాడు. ఓపెనర్ రియాన్ రికెల్టన్(0) వికెట్ తీసి సఫారీలపై ఒత్తిడి పెంచాడు సింగ్. అయితే.. క్వింటన్ డికాక్(106), కెప్టెన్ తెంబా బవుమా(48)లు రెండో వికెట్‌కు అర్ధ శతకం భాగస్వామ్యంతో దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. హాఫ్ సెంచరీకి చేరువైన బవుమాను జడేజా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాథ్యూ బ్రీట్జ్(24), రాయ్‌పూర్ శతక వీరుడు మర్క్రమ్(1)లను ఔట్ చేసిన ప్రసిధ్ కృష్ణ(4-66) స్కోర్ వేగానికి బ్రేకులు వేశాడు.
Dewald Brevis ✅
Marco Jansen ✅Two in an over for Kuldeep Yadav!
South Africa 7⃣ Down
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/aQTLqgmGVb
— BCCI (@BCCI) December 6, 2025
ఓవైపు వికట్లు పడుతున్నా డికాక్ మాత్రం దూకుడు తగ్గించలేదు. 80 బంతుల్లో సెంచరీకి చేరువైన డికాక్ భారత్‌పై ఏడోసారి ఈ ఫీట్ నమోదు చేశాడు. శతకం తర్వాత మరింత చెలరేగాలనుకున్న డికాక్‌ను ప్రసిధ్ బౌల్డ్ చేసి సఫారీలను దెబ్బకొట్టాడు. 99కే ఐదు వికెట్ల పడిన వేళ.. యువకెరటం డెవాల్డ్ బ్రెవిస్(29), మార్కో యాన్సెన్(17)లు బౌండరీలతో చెలరేగారు. డెత్ ఓవర్లలో మరింత దంచేయాలనుకున్న ఈ ఇద్దరిని 39వ ఓవర్లో ఔట్ చేశాడు కుల్దీప్.
South Africa are all out for 2⃣7⃣0⃣ in Vizag
Prasidh Krishna with the final wicket of the innings 😎
He finishes with a four-wicket haul 🙌
Scorecard ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/5mays2y5uS
— BCCI (@BCCI) December 6, 2025
ఒక్క పరుగు తేడాతో హిట్టర్లు వెనుదిరగడంతో పర్యాటక జట్టు 300ల మార్క్ చేరుకోలేకపోయింది. కాసేపటికే కార్బిన్ బాష్(9)ను సైతం రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు కుల్దీప్. ఆఖర్లో్ .. కేశవ్ మహారాజ్(20 నాటౌట్) కాసేపు పోరాడగా.. బార్ట్‌మన్‌ను ప్రసిధ్ బౌల్డ్ చేయడంతో 270కే సఫారీ టీమ్ ఆలౌటయ్యింది.