సిడ్నీ: ఎట్టకేలకు ఆస్ట్రేలియా వికెట్ (IND vs AUS) పడింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 4వ ఓవర్లో ఓపెనర్ కొన్‌స్టాస్ (22) సుందర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 161 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. బుమ్రా గౌర్హాజరీలో సిరాజ్ తొలి ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో 13 రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన ప్రసిద్ధ్ కూడా 13 పరుగులు సమర్పించుకున్నాడు.
దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 39 రన్స్ చేసింది. అయితే 39 పరుగుల వద్ద ప్రసిద్ధ్ వేసిన నాలుగో ఓవర్లో భారీ షాట్‌కు యత్నించిన కొన్‌స్టాప్.. వాషింగ్టన్ సుందర్‌కు దొరికిపోయాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సరికి 41 రన్స్ చేసింది. విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా మరో 122 రన్స్ చేయాల్సి ఉంది.
Prasidh Krishna with the first wicket of the innings
Sam Konstas departs for 22.
Live – https://t.co/NFmndHLfxu#TeamIndia | #AUSvIND pic.twitter.com/N4o6mWtS28
— BCCI (@BCCI) January 5, 2025