West Indies Squad : పొట్టి ఫార్మాట్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన వెస్టిండీస్ (West Indies) మూడో కప్ కోసం భారత్‌కు వస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచకప్ కోసం సోమవారం విండీస్ క్రికెట్ స్క్వాడ్‌ను ప్రకటించింది. షాయ్ హోప్(Shai Hope) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్(CPL)లో రాణించిన పవర్ హిట్టర్లకు, ఐపీఎల్ అనుభవమున్న ఆటగాళ్లకు ప్రాధాన్యమిస్తూ పటిష్టమైన స్క్వాడ్‌ను వెల్లడించారు సెలెక్టర్లు.
గత సీజన్ టీ20 వరల్డ్‌కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన వెస్టిండీస్.. ఈసారి భారత్‌లో చెలరేగేందుకు సిద్ధమవుతోంది. మెగా టోర్నీకి సమయం సమీపిసున్నందున సోమవారం షాయ్ హో సారథిగా స్క్వాడ్‌ను ప్రకటించారు. ఇటీవలే నేపాల్ చేతిలో టీ20 సిరీస్ ఓటమి నుంచి తేరుకున్న విండీస్.. అనుభవంతో పాటు పొట్టి ఫార్మాట్‌కు సరిపోయే ఆటగాళ్లను నమ్ముకుంది. హిట్మైర్, పావెల్, హోల్డర్లు బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు.
2-time World T20 champions, West Indies, reveal their squad for the upcoming ICC Men’s T20 World Cup 🔥
ICC Men’s #T20WorldCup 2026 👉 Starts FEB 7 pic.twitter.com/ntUD2qOTq9
— Star Sports (@StarSportsIndia) January 26, 2026
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో 241 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన క్వెంటిన్ శాంప్సన్కు చోటు దక్కింది. పేస్ దళం షమర్ జోసెఫ్, హోల్డర్, మాథ్యూ ఫోర్డే, జైడెన్ సీల్స్‌తో పటిష్టంగా ఉంది. స్పిన్ భారాన్ని మోతీ, ఛేజ్, అకీల్ హోసేన్ మోయనున్నారు. అయితే.. ఆశ్చర్యంగా గాయాలతో సతమతమవుతున్న ఓపెనర్ ఎవిన్ లెవిస్, పేసర్ అల్జారీ జోసెఫ్‌లకు మాత్రం నిరాశే ఎదురైంది.
వెస్టిండీస్ స్క్వాడ్ : షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హిట్మైర్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, జేసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫొర్డ్, రొయారియో షెపర్డ్, క్వింటిన్ శాంప్సన్, అకీల్ హొసేర్, గుడకేశ్ మోతీ, షమర్ జోసెఫ్, జైడన్ సీల్స్, మాథ్యూ ఫొర్డే.
ON THIS DAY: West Indies Men won their first T20 World Cup title 🏆
The #MenInMaroon conquered the world with a thrilling victory over Sri Lanka. A moment of pride that still shines bright! 🏏🌴 pic.twitter.com/ZRr6o3TYCG
— Windies Cricket (@windiescricket) October 7, 2024
వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారం గ్రూప్ సీలోని వెస్టిండీస్ ఫిబ్రవరి 7న స్కాట్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. తదుపరి లీగ్ మ్యాచుల్లో ఇంగ్లండ్, నేపాల్, ఇటలీ, నెదర్లాండ్స్ జట్లతో మాజీ ఛాంపియన్ తలపడనుంది. గతంలో డారెన్ సమీ కెప్టెన్సీలో రెండు పర్యాయాలు జగజ్జేతగా నిలిచింది కరీబియన్ టీమ్. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ 2012, 2016లో కప్‌ను ఎగరేసుకుపోయింది. భారత్(2007, 2024), ఇంగ్లండ్(2010, 2022)లు సైతం రెండేసి కప్‌లు కొల్లగొట్టాయి.