IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో లక్సో సూపర్ జెయిం(LSG)ట్స్ జోరు కొనసాగిస్తోంది. వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటన్స్(Gujarat Titans)కు బిగ్ షాకిచ్చింది. ఓపెనర్ల మెరుపులతో భారీ స్కోర్ దిశగా సాగిన గుజరాత్‌ను 180 కే కట్టడి చేసిన లక్నో.. ఆ తర్వాత ఛేదనలోనూ దుమ్మురేపింది. నికోలస్ పూరన్(61), ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(58) హాఫ్ సెంచరీలతో చెలరేగగా 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
ఆఖర్లో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసినా.. ఇంప్యాక్ట్ ప్లేయర్ ఆయుష్ బదొని(28 నాటౌట్), డేవిడ్ మిల్లర్(7)లు ఒత్తిడికి లోనవ్వలేదు. 20వ ఓవర్లో బౌండరీ బాదిన బదొని.. ఆ తర్వాత సిక్సర్‌తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. దాంతో, ఐదో విక్టరీకిపై కన్నేసిన గుజరాత్‌కు భంగపాటు తప్పలేదు.
Into the 🔝 4 with a 💥 pic.twitter.com/bv1Louau6h
— Lucknow Super Giants (@LucknowIPL) April 12, 2025
సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ పంజా విసిరింది. టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటన్స్‌ను ఓడించి టాప్ -4లోకి దూసుకెళ్లింది. బంతితోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించిన లక్నో మొదట ప్రత్యర్థిని 180కే కట్టడి చేసింది. ఛేదనలో ఓపెనర్లు ఎడెన్ మర్క్రమ్(58), కెప్టెన్ రిషభ్ పంత్()లు ధాటిగా ఆడారు. పవర్ ప్లేలో గుజరాత్ పేస్ గన్స్ సిరాజ్, ప్రసిధ్లను ఉతికేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దాంతో, 6 ఓవర్లలో 62 కొట్టిన లక్నో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే.. సుందర్ బౌలింగ్‌లో పంత్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్(61: 34 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లు) మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరోవైపు మర్క్రమ్ సైతం దూకుడు పెంచి 26 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు.ఈ ఇద్దరి మెరుపులతో లక్నో స్కోర్ 10 ఓవర్లకు 114కు చేరింది.
Q: How to stop Nicholas Pooran?
A: Error 404 Not Found ⚠Half-century No. 4⃣ for Nicholas Pooran in #TATAIPL 2025 🫡
Updates ▶ https://t.co/VILHBLEerV #LSGvGT | @nicholas_47 pic.twitter.com/Wg2ZJB4zwc
— IndianPremierLeague (@IPL) April 12, 2025
విజయానికి చేరువైన లక్నోను ప్రసిధ్ దెబ్బకొట్టాడు. మర్క్రమ్ ఔటయ్యాక హాఫ్ సెంచరీ బాదిన పూరన్ సైతం రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్(7), ఇంప్యాక్ట్ ప్లేయర్ ఆయుష్ బదొని(28 నాటౌట్)లు జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. అయితే.. లక్నో విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరం అయ్యాయి. రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో బదొని ఫైన్ లెగ్‌లో ఫోర్ బాదాడు. కానీ, ఆ తర్వాత సుందర్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయిన మిల్లర్ బౌల్డ్ అయ్యాడు. ఆఖరి ఓవర్లో 6 రన్స్ కావాలి. అబ్దుల్ సమద్(2) సింగిల్ తీయగా.. బదొని బౌండరీ కొట్టాడు.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 180 రన్స్ కొట్టింది. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(60), సాయి సుదర్శన్(56)లు మరోసారి చితక్కొట్టారు. ఎక్నాస్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అర్ధ శతకాలతో చెలరేగిన ఈ ద్వయం తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోర్‌కు బాటలు వేసింది. అయితే.. స్ట్రాటజిక్ టైమౌట్ తర్వాత పుంజుకున్న లక్నో బౌలర్లు గుజరాత్ మిడిలార్డర్‌ను క్రీజులో నిలవనీయలేదు. ఆఖర్లో షెర్ఫానే రూథర్‌ఫొర్డ్(22) ఒక్కడే మెరుపులు మెరిపించగా గిల్ బృందం నిర్ణీత ఓవర్లలో 180 రన్స్ చేయగలిగింది.
Target set! ✅
The defence is on! 💪 pic.twitter.com/pvDT5gcVkT— Gujarat Titans (@gujarat_titans) April 12, 2025