న్యూఢిల్లీ: ఆల్రౌండ్ ప్రదర్శనతో అండర్ 19 ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన యువ భారత జట్టుకు ప్రధానిమోదీ శుభాకాంక్షలు తెలిపారు. టోర్నీ మొదలైనప్పటి నుంచి చివరి వరకు యువ ఆటగాళ్లు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు.
‘వారు టోర్నమెంట్ మొత్తం గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు. భారత క్రికెట్ సురక్షితమైన, సమర్థవంతమైన చేతుల్లో ఉందనడానికి యువ క్రికెటర్ల అద్భుత ప్రదర్శనే నిదర్శనం’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.