Smriti Mandhana : వరల్డ్ కప్ విజేత స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి తేదీ వచ్చేసింది. ప్రపంచకప్ టోర్నీ ముగిసినప్పటి నుంచి మంధాన వివాహంపై వస్తున్న కథనాలకు ఎట్టకేలకు వెడ్డింగ్ కార్డ్‌తో ఎండ్ కార్డ్ పడింది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్(Palah Muchchal)తో ఈ ముద్దుగుమ్మ నవంబర్ 20న ఏడడుగులు నడువనుందనే వార్తలు వినిపించాయి. అయితే.. ఆ తేదీ కాస్త ముందుకు జరిగింది. నవంబర్ 23 ఆదివారం ఈ స్టార్ జంట మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ధ్రువీకరించడం విశేషం. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ.. పెళ్లి తేదీని బహిర్గతం చేశారు.
భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈమధ్య నెట్టింట తెగ వైరలైంది. వరల్డ్ కప్‌లో తన ఆటతో పాటు ఆమె పెళ్లి పత్రిక కూడా సోషల్ మీడియాలో తెగ తిరిగింది. నవంబర్ 20వ తేదీన స్మృతి-పలాశ్ వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ప్రచారం జరిగింది. అంతేనా.. వీరి వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరలైంది కూడా. మహారాష్ట్రలోని స్మృతి మంధాన స్వస్థలం సాంగ్లీలో జరగనుందని.. ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా అందాయని కథనాలు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. కాకపోతే పెళ్లి తేదీ 20 నుంచి 23కు మారిందంతే. ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షల సందేశంతో ఈ విషయం బయటకొచ్చింది.

‘స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ నవంబర్ 23న పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి సంతోషిస్తున్నా. ఈ శుభసందర్భంగా ఇరుకుటుంబాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్కరిగా ఉంటూ..ఒకరి సమక్షంలో ఒకరు ఐకమత్యంగా ఉంటూ సాగాలని కోరుకుంటున్నా. వారి లక్ష్యాలు నెరవేరాలని, జంటగా వృద్ధి సాధించాలని, పరస్పర అవగాహనతో వీరిద్దరి జీవితం ఆనందమయం కావాలని ఆశిస్తున్నా. మంధాన, పలాశ్లు నమ్మకంతో కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు. ఒకరికొకరు మద్దతుగా ఉంటూ, బాధ్యతగా వ్యవహరిస్తూ.. ప్రేమానురాగాలతో వర్ధిల్లాలి’ అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
PM Narendra Modi wished Smriti Mandhana and Palash Muchhal on their engagement.
Also revealed the wedding date of the cricketer-composer couple in special note. #PMModi #SmritiMandhana https://t.co/vXtf4meO0a
— India Today Sports (@ITGDsports) November 20, 2025
ఇటీవలే ఇండోర్‌లోని ప్రెస్ క్లబ్లో ‘మంధానతో మీ అనుబంధం గురించి చెప్పండి?స అని జర్నలిస్టులు పలాశ్ను అడిగారు. అందుకు .. ‘మంధాన త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది. ఇప్పుడు మీకు ఈ విషయం మాత్రమే చెప్పగలను. ఇంకేం చూస్తున్నారు.. మీకు హెడ్లైన్ ఇచ్చేశాను’ అని పలాశ్ బదులిచ్చాడు. అతడి మాటలతో ఇరువురి పెళ్లిపై స్పష్టత వచ్చేసింది. అయితే.. వరల్డ్ కప్‌లో ఆడతున్న మంధాన కూడా ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియాపై రెండు శతకాలతో చెలరేగిన మంధాన ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డ్ విజేతగా నిలిచింది.
ఈ ఏడాది జూలై 19, శనివారం ఈ డాషింగ్ ఓపెనర్ 29వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలాశ్ తన కలల రాణికి తన మనసుపుస్తకాన్ని ఆవిష్కరిస్తూ పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపాడు. మన ప్రయాణం మొదలైనప్పటి నుంచి నువ్వే నా ప్రశాంతత. నా కన్ఫ్యూజన్ కూడా. నా బిగ్గెస్ట్ చీర్ లీడర్ నువ్వే. నాలో స్ఫూర్తిని నింపేది కూడా నీవే. ఒత్తిడిలోనూ కూల్‌గా ఉండడం నిన్ను చూసే నేర్చుకున్నా. హ్యాపీ బర్త్ డే స్మృతీ’ అంటూ తన ప్రేమ సందేశాన్ని రాసుకొచ్చాడు. మనసైనోడి నుంచి విషెస్ అందుకున్న మంధాన.. నువ్వే నా హార్ట్ బీట్ అనే అర్ధం వచ్చేలా ‘థ్యాంక్యూ మై బాయ్’ అనే పోస్ట్‌కు లవ్ ఎమోజీలతో బదులిచ్చింది.
She hits centuries. He writes symphonies.
One breaks records on the field, the other heals hearts through music, and together they’ve built a love story that’s all rhythm, no noise.
From stadium lights to soulful nights, watch the reel and feel their story unfold.
Credits:… pic.twitter.com/EDMEAOMmpQ
— The Better India (@thebetterindia) November 10, 2025
భారత ఓపెనర్‌గా అదరగొడుతున్న మంధానకు, కచేరీలు, సొంతంగా ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన పలాశ్ ముచ్చల్‌కు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి తరచూ పార్టీల్లో కలుస్తుండేవాళ్లు. అలా ఒకరిమీద ఒకరికి 2019 లోనే ప్రేమ పుట్టింది. అలాగని తమ రిలేషన్‌షిప్‌ను ఇద్దరూ రహస్యంగానే ఉంచారు. ఈ జంట 2013లో తొలిసారి దీపావళి పండుగను కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలోనే వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే వార్తలు వచ్చాయి. అయినా సరే మంధాన, పలశ్లు ఓపెన్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా ఇద్దరూ జంటగా కెమెరా కంట పడ్డారు. ఈ క్రమంలోనే తన ప్రేయసికి పలాశ్ పియానో గురువుగా మారాడు. ఆ వీడియో అప్పట్లో కూడా బాగా వైరల్ అయింది.
ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న మంధాన పరుగుల వరద పారిస్తోంది. వరల్డ్ కప్ ముందే ఆస్ట్రేలియాపై రెండు సెంచరీలతో కదం తొక్కిన ఈ డాషింగ్ బ్యాటర్ మెగా టోర్నీ తొలి రెండు మ్యాచుల్లో నిరాశపరిచింది. కానీ, వైజాగ్‌లో ప్రతీకా రావల్‌తో కలిసి ఆసీస్ బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు శుభారంభం ఇచ్చిన మంధాన సెంచరీ ముందు ఔటయ్యింది. లేదంటే.. ఈ ఏడాది నాలుగు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్న ఆమె తంజిబ్ బ్రిట్స్ ( Tanzim Brits) రికార్డును సమం చేసేది.
A moment to cherish 🫡
Youngest and quickest to reach 5️⃣0️⃣0️⃣0️⃣ runs in Women’s ODIs ✅
Smriti Mandhana is putting on a show in Vizag.
Updates ▶ https://t.co/VP5FlL3pWw#TeamIndia | #WomenInBlue | #INDvAUS | #CWC25 | @mandhana_smriti pic.twitter.com/X6M48wYHZW
— BCCI Women (@BCCIWomen) October 12, 2025
హాఫ్ సెంచరీ తర్వాత వెనుదిరిగిన మంధాన వన్డేల్లో 5వేల పరుగుల క్లబ్లో చేరింది. ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులతో ఆస్ట్రేలియా దిగ్గజం బెలిండా క్లార్క్ (Belinda Clark) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్ధలు కొట్టిందీ బ్యాటింగ్ క్వీన్. ఆసీస్ వెటరన్ అయిన క్లార్క్ 1997లో 970 రన్స్‌తో చరిత్ర సృష్టించింది. అప్పటినుంచి .. దాదాపు 27 ఏళ్లుగా చెక్కు చెదరని రికార్డును మంధాన బ్రేక్ చేసింది. మొత్తంగా 18 ఇన్నింగ్స్‌ల్లో మంధాన 59.00 సగటుతో 1,062 పరుగులు సాధించింది.
Samjho ho hi gaya! 💍
Congratulations @mandhana_smriti 💕 pic.twitter.com/3HMAkQSFIO
— Circle of Cricket (@circleofcricket) November 20, 2025