సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్కు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. సౌతాంప్టన్లో వర్షం కారణంగా సోమవారం కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే ఆటను రద్దు చేశారు. సోమవారం ఉదయం నుంచి వర్షం కురవడంతో ఏజీస్ బౌల్ మైదానం చెరువును తలపించింది. దీంతో ఈ రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. వర్షం కారణంగా ఇప్పటికే టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే.
Day four of the #WTC21 Final has been abandoned due to persistent rain ⛈️#INDvNZ pic.twitter.com/QvKvzQCphG
— ICC (@ICC) June 21, 2021