PKL 2025 : ప్రోకబడ్డీ లీగ్ పన్నెండ్ సీజన్ తుది దశకు చేరుకుంది. ఉత్కంఠ పోరాటాలతో ఫ్యాన్స్‌కు కబడ్డీ మజాను పంచిన లీగ్ ప్లే ఆఫ్స్(Play Offs)కు సిద్ధమవుతోంది. ఆరంభం నుంచి అదరగొడుతూ టాప్ -8లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అక్టోబర్ 25 నుంచి 31 తేదీ వరకూ ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో బిగ్ ఫైట్స్ జరుగనున్నాయి.
పన్నెండో సీజన్లో దుమ్మురేపిన పుణెరి పల్టన్, దబాంగ్ ఢిల్లీ కేసీ జట్లు 26 పాయింట్ల మొదటగా ప్లే ఆఫ్స్ చేరాయి. బెంగళూరు బుల్స్ 22 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. 20 పాయింట్లతో తెలుగు టైటాన్స్, హర్యానా స్టీలర్స్, యూ ముంబా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఆఖర్లో పుంజుకున్న పట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు ప్లే ఆఫ్స్ బెర్తులు పట్టేశాయి.
1 Trophy 🏆 8 Contenders 🔥
PKL Season 12 Playoffs kick off from tomorrow! 💪🤼♂️
Get ready for the ultimate battle! ⚔️🔥
.
.
.#ProKabaddi #PKL2025#PKLSeason12 #Kabaddi360 pic.twitter.com/0MEEFqXrAw— Kabaddi360 (@Kabaddi_360) October 24, 2025
అక్టోబర్ 26న జరిగే తొలి మ్యాచ్ విజేత ఎలిమినేటర్ 1కు దూసుకెళ్తుంది. ఆ తర్వాతి రోజు.. మినీ క్వాలిఫయర్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ తలపడుతాయి. అక్టోబర్ 27న ఎలిమినేటర్ 2 నిర్వహిస్తారు. టేబుల్ టాపర్స్ జట్ల మధ్య జరిగే క్వాలిఫయర్ 1లో గెలుపొందిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. అక్టోబర్ 28న ఎలిమినేటర్ 3, అక్టోబర్ 29న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు ఉంటాయని నిర్వహకులు తెలిపారు.