ముంబై: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్ వేలం పాటకు వేళయైంది. ఈనెల 31, జూన్ 1 తేదీల్లో ముంబై వేదికగా లీగ్ వేలం జరుగనుంది. ఈ మధ్యే ముగిసిన పీకేఎల్ 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్ తొలిసారి టైటిల్ విజేతగా నిలిచింది.
ఈ నేపథ్యంలో రానున్న సీజన్‌కు మరిన్ని మెరుగులు అద్దే క్రమంలో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.