నోయిడా: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఊపేసింది. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్, యూపీ యోధాస్ మధ్య జరిగిన మ్యాచ్ 29-29 పాయింట్లతో టై గా ముగిసింది. ఆట నిర్దేశిత సమయానికి ఇరు జట్ల స్కోర్లు సమానం కావడంతో రెండు జట్లకూ తలా 3 పాయింట్లు దక్కాయి. యూపీ తరఫున భవానీ రాజ్పుత్ 10 పాయింట్లతో మెరవగా పూణె కెప్టెన్ మోహిత్ 9 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో పాట్నా.. 54-31తో బెంగళూరుపై విజయం సాధించింది.