దుబాయ్: ఇద్దరు లెజెండ్స్ కలిసిన వేళ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ మాట్లాడుకుంటున్న ఫొటోను షేర్ చేసింది బీసీసీఐ. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. టీ20 వరల్డ్‌కప్( T20 World Cup )లో టీమిండియా మెంటార్‌గా ధోనీ వ్యవహరిస్తుండగా.. గేల్ ఇప్పటికీ విండీస్ టీమ్‌కు ఆడుతున్నాడు. సోమవారం ఇంగ్లండ్‌పై టీమిండియా వామప్ మ్యాచ్ గెలిచిన తర్వాత వీళ్లిద్దరూ కలిసిన ఫొటోను బీసీసీఐ షేర్ చేసింది. ఇద్దరు లెజెండ్స్.. ఒక గుర్తుండిపోయే జ్ఞాపకం. ధోనీ, గేల్ కలిసిన వేళ అంటూ బీసీసీఐ ఈ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసింది. అటు విండీస్ క్రికెట్ కూడా ఆ టీమ్ ప్లేయర్స్ మన ఇండియన్ ప్లేయర్స్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది.
Two legends 🙌
— BCCI (@BCCI) October 18, 2021
One memorable moment 👏
When @msdhoni & @henrygayle caught up. 👍 👍#TeamIndia #T20WorldCup pic.twitter.com/mBOyJ3oe2K
Nothing but good vibes & smiles in Dubai.❤😁 #MissionMaroon #T20WorldCup #WestIndies pic.twitter.com/6LoEMAifa1
— Windies Cricket (@windiescricket) October 18, 2021