Phil Salt | అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. పంజాబ్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు ఓపెనర్ ఫిల్ సాల్ట్ జట్టుతో చేరాడు. పంజాబ్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయాడు. తన భార్య తొలిబిడ్డకు జన్మనివ్వడంతో స్వదేశానికి వెళ్లాడు. తిరిగి మంగళవారం వేకువ జామున 3 గంటల సమయంలో తిరిగి జట్టుతో చేరాడు. మ్యాచ్‌కు కొద్దిగంటల ముందు విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ చేరడంతో జట్టు బలం పెరిగింది.
Read Also : 18 ఏండ్ల కల కోసం.. ఆఖరి పోరాటం
ఫిల్ సాల్ట్ ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. విరాట్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేరాడు. ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని వార్తలు వచ్చాయి. సోమవారం జరిగిన జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు సైతం దూరమయ్యాడు. ఫైనల్‌కు కొద్దిగంటల ముందు అహ్మదాబాద్‌కు చేరడంతో జట్టులో ఉత్సాహం నెలకొన్నది. ఫిల్ సాల్ట్ ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున మెరుగ్గా రాణించాడు. ఇప్పటి వరకు 12 మ్యాచుల్లో 35.18 సగటు 175.90 స్ట్రయిక్ రేట్‌తో 387 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై 27 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 56 పరుగులు చేశాడు.
Read Also : హిట్టర్లు ముగించారు
పంజాబ్ నిర్దేశించిన 102 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లు, 60 బంతులు మిగిలి ఉండగానే గెలువడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌కు టిమ్ డేవిడ్ దూరమయ్యే అవకాశం ఉంది. లక్నోలోని ఎకానాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకోలేదు. దాంతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. టిమ్ డేవిడ్ స్థానంలో లియామ్ లివింగ్ స్టోన్ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉన్నది. లేకపోతే న్యూజిలాండ్‌కు చెందిన ఆటగాడు టిమ్ సీఫెర్ట్ని తీసుకునే ఛాన్స్ ఉంది. ఇద్దరిలో తుదిజట్టులో ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ ఎవరికి చోటు కల్పిస్తుందో వేచి చూడాల్సిందే.