మెల్బోర్న్: ఇటీవలి కాలంలో తరుచూ గాయాల పాలవుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇకపై వన్డేలలో కొనసాగబోనని ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌పై దృష్టిసారించిన మ్యాక్సీ.. వన్డేల నుంచి తప్పుకున్నాడు. సోమవారం అతడు ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో 2027 వన్డే ప్రపంచకప్ ఆడతానని నేను అనుకోవట్లేదు. ఈ విషయాన్ని సెలెక్టర్లకు వివరించా. నా స్థానంలో ఇతరులకు అవకాశమిచ్చేందుకు ఇదే సరైన సందర్భమని వాళ్లకు చెప్పా.
రాబోయే వరల్డ్‌కప్‌లో జట్టు కూర్పు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నాలో ఆట మిగిలున్నంత వరకూ ఆడతానని గతంలో చెప్పా. కానీ నా స్వార్థం కోసం కొన్ని సిరీస్‌లు ఆడి ఊరుకోలేను’ అని చెప్పాడు. 36 ఏండ్ల మ్యాక్సీ.. 149 వన్డేలలో 33.81 సగటుతో 3,990 పరుగులు చేశాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 91/7 స్కోరు వద్ద ఉండగా అతడు ఆడిన ఇన్నింగ్స్‌ను క్రికెట్ ప్రపంచం ఇప్పట్లో మరిచిపోలేదు. ఆ మ్యాచ్‌లో మ్యాక్సీ.. కాళ్లకు తిమ్మిర్లు వచ్చినా 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే గాక జట్టును విజయతీరాలకు చేర్చాడు.
నా జీవితంలో బాధాకరమైన రోజు: క్లాసెన్
కేప్‌టౌన్: 33 ఏండ్ల క్లాసెన్ దక్షిణాఫ్రికా తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20లు ఆడి 2,764 పరుగులు చేశాడు. మార్చిలో ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్ క్లాసెన్‌కు చివరిది. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి వీరబాదుడు బాదే క్లాసెన్.. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. క్లాసెన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ.. ఇది తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు అని భావోద్వేగానికి గురయ్యాడు.