Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. అయితే, ఇప్పటికే టోర్నీపై సందిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. పాక్‌కు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాల్సిందేనని పట్టుబడుతున్నది. అయితే, మొదట ససేమిరా అన్న పాకిస్థాన్ బోర్డు హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో భారత్‌లో భవిష్యత్‌లో జరిగే టోర్నీలను సైతం హైబ్రిడ్ మోడ్‌లోనే నిర్వహించాలని కొర్రీలు పెట్టింది. వాస్తవానికి ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహిస్తారని అందరికీ తెలుసునన్నారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు పీసీబీ మాజీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అంగీకరించారన్నారు.
2026లో భారత్‌లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఇదే తరహాలోనే షరతుపెట్టాడన్నారు. 2026 టీ20 ప్రపంచకప్ కోసం పాక్ తమ జట్టును భారత్‌కు పంపితేనే.. 202728లో మహిళల ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తుందంటూ పీసీబీకి ఐసీసీ ప్రతిపాదన పెట్టిందని బాసిత్ పేర్కొన్నారు. 2027-28లో జరిగే మహిళల ప్రపంచకప్ ఆతిథ్యం పాక్‌కు దక్కే అవకాశం ఉందని.. అయితే, ఈ విషయంలో అందరూ సంతోషిస్తున్నారన్నారు. 2026లో పాకిస్థాన్ జట్టును భారత్‌కు పంపితేనేది ఇది జరుగుతుందన్నారు. ఆ తర్వాత భారత మహిళల జట్టు పాక్‌కు వస్తుందని.. దాంతో బ్రాడ్‌కాస్టర్‌కు ఎలాంటి నష్టం ఉండదన్నారు. దీన్ని అంగీకరించాలని చెప్పి పీసీబీకి ఐసీసీ ఈ లాలీపాప్ ఇచ్చిందంటూ విమర్శించారు. ఈ విషయంలో రాతపూర్వక ఏ హామీ అడగొద్దని.. దానికి బదులు మరో ఐసీసీ ఈవెంట్ ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. దీనికి బదులుగా ఆసియా కప్ హక్కుల విషయంలో డిమాండ్ చేయాలన్నారు. ఆసియా కప్ ఏసీసీ పరిధిలోకి వస్తుందని.. ఐసీసీ కాదన్న ఆయన.. అంతిమంగా ఐసీసీ బిగ్‌బాస్ అని పేర్కొన్నారు.