PCB : అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ జట్టుకు తగ్గట్టే ఆ దేశ బోర్డు తీరు సాగుతోంది. రెండేండ్ల కాలంలో ఇద్దరిని కోచ్‌లుగా మార్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) ఇప్పుడు హెడ్‌కోచ్‌ను తప్పించేందుకు సిద్దమవుతోంది. విదేశీ కోచ్‌ల కంటే స్వదేశీయులకే పట్టం కట్టాలని భావిస్తున్న పీసీబీ కీలక నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం రెడ్ బాల్ కోచ్‌గా సేవలందిస్తున్న జేసన్ గిలెస్పీ(Jason Gillespie)కి బైబై చెప్పాలనుకుంటోంది.
గిలేస్పీ స్థానంలో తమ దేశానికే చెందిన మాజీ పేసర్ అకీబ్ జావెద్ (Aaqib Javed)కు కోచ్‌గా బాధ్యతలు అప్పగించేందుకు పావులు కదుపుతోంది. మాజీ పేసర్ అయిన జావేద్ ప్రస్తుతం శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కొత్త కోచ్‌గా జావెద్ పేరును అధికారికంగా పీసీబీ ప్రకటించనుందని టాక్.
EXCLUSIVE: Jason Gillespie is set to be removed as Pakistan head coach 🔁
Full story: https://t.co/YLdvBVi8BL pic.twitter.com/f4m6N4BSnq
— ESPNcricinfo (@ESPNcricinfo) November 17, 2024
టీ20 వరల్డ్ కప్ అనంతరం కోచ్‌గా వచ్చిన గ్యారీ కిర్‌స్టెన్ (Gary Kirsten) రాజీనామా చేయడంతో పీసీబీ అంతర్మథనంలో పడింది. మూడు ఫార్మాట్లకు ఒకే కోచ్ సూత్రాన్ని పాటించాలని తొలుత అనుకుంది. ప్రస్తుతం టెస్టు జట్టు కోచ్‌గా ఉన్న జేసన్ గిలెస్పీకే వన్డే, టీ20 కోచ్‌గా పగ్గాలు ఇవ్వాలని పీసీబీ భావించింది. అయితే.. అందుకు అతడు సిద్దంగా లేనని చెప్పాడేమో.. ఇక లాభం లేదనుకొని జావెద్‌ను తీసుకోవాలని పాక్ బోర్డు నిర్ణయించుకుంది.
మాజీ స్పీడ్‌స్టర్ అయిన జావేద్ 1992లో వరల్డ్ కప్ గెలిచిన పాకిస్థాన్ జట్టులో సభ్యుడు. ఆటకు వీడ్కోలు పలికన తర్వాత అతడు బౌలింగ్ కోచ్‌గా అవతారమెత్తాడు. జావేద్ కోచ్‌గా ఉన్న సమయంలోనే
పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్( 2009) చాంపియన్‌గా అవతరించింది. అనంతరం అతడు పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు కోచ్‌గా సేవలందించాడు.
జావేద్ శిక్షణలో రాటుదేలిన యూఏఈ జట్టు వన్డే, టీ20 స్టేటస్ దక్కించుకుంది. అంతేకాదు 2015 వరల్డ్ కప్‌లో ఆడింది. కోచ్‌గా సూపర్ ట్రాక్ రికార్డు ఉన్న జావేద్.. లంక క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తాడా? లేదా? చూడాలి. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో లాహోర్ క్యాలండర్స్ జట్టుకు హెడ్‌కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా జావేద్ పని చేస్తున్నాడు.