BGT 2024 -25 : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐదోసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నాడు. ఈమధ్య ఒక్క మ్యాచ్‌లోనూ సెంచరీ కొట్టని విరాట్ కంగారూల గడ్డపై మునపటిలా చెలరేగుతాడా? లేదా? అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. ఒకవేళ కోహ్లీ ఐదు టెస్టుల బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో విఫలమైతే బహుశా అతడికి ఇదే ఆఖరి పర్యటన అవడం ఖాయం.
అందుకని విరాట్ సైతం ఈసారి పట్టుదలగా ఆడాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. చాంపియన్ ప్లేయర్ అయిన అతడిని తక్కువ అంచనా వేయబోమని ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంటున్నారు. ఇక మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ (Mitchell Jhonson) అయితే కోహ్లీ తమగడ్డపై మరో శతకం కొట్టాలని ఆకాంక్షిస్తున్నాడు.
The battle that defines legends Kohli vs Johnson. Absolute blockbuster! 🔥pic.twitter.com/N0ZePkBXKr
— GBB Cricket (@gbb_cricket) November 12, 2024
’36 ఏండ్ల కోహ్లీకి ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన అనుకుంటా. ఇక్కడ అతడు చాలా గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడి కెరీర్ సగటు 47.83 కంటే ఆస్ట్రేలియాలో సగటు (54.05) ఎక్కువ. అయితే.. ఈమధ్య అతడి ఫామ్ అత్యుత్తమంగా లేదు. మునపటిలా ఆడాలనే ఒత్తిడి కోహ్లీపై ఉంది. ఒక అభిమానిగా సిరీస్ చూడబోతున్న నేను కోహ్లీ మరొక సెంచరీ కొట్టాలని ఆశిస్తున్నా. అయితే.. పదేండ్ల క్రితం అతడిలో ఉన్న దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. ఒక్క విషయం ఏంటంటే.. అత్యుత్తమ జట్టుతో అత్తుత్తమ ఆట ఆడాలని నేను కోరుకుంటున్నా’ అని జాన్సన్ తెలిపాడు.
ఆస్ట్రేలియా గడ్డపై 25 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 2,042 పరుగులు సాధించాడు. మిచెల్ జాన్సెస్ సహా, మెక్‌గ్రాత్, బ్రెట్‌లీ, కమిన్స్, స్టార్క్ వంటి పేసర్లను ఉతికేసిన విరాట్ ఏకంగా 8 సెంచరీలు బాదేశాడు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో విరాట్ చెలరేగితే టీమిండియా ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.