Disha Patani | కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన చిత్రం కంగువ. పీరియాడికల్ యాక్షన్ మూవీని దర్శకుడు సిరుత్తై శివ తెరకెక్కించారు. ఈ భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ నెల 14న విడుదల ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తున్నది. ఇక మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించాడు. హీరోయిన్గా హాట్‌బ్యూటీ దిశా పటానీని నటించింది. కంగువ మూవీ కోసం దిశా పటానీ కళ్లు చెదిరేలా రెమ్యునరేషన్ తీసుకున్నది. ఈ మూవీలో దిశా పటానీ తన నటనతో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. గతంలో వచ్చిన చిత్రాల్లోనూ నటనతో ఆకర్షించలేకపోయింది. కేవలం అందాల ఆరబోతను చూసే ఆమెకు ఛాన్స్ ఇస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇక మూవీ కోసం కోసం దిశ రూ.5కోట్లు రెమ్యునరేషన్ వసూలు చేసింది. గతంలో ఏ సినిమాకు తీసుకోని విధంగా కంగువా మూవీకి భారీగా ఫీజు వసూలు చేసిందని టాక్ వినిపిస్తున్నది.
సినిమా స్టోరీ విషయానికి వస్తే వందల సంవత్సరాల కిందట సముద్రాన్ని ఆనుకొని ప్రణవ కోన, రుధిర కోన, కపాల కోన, హిమ కోన, చీకటి కోన అనే ఐదు ప్రాంతాలుంటాయి. ఒక్కో కోనకు ఒక్కో పాలకుడు ఉంటాడు. ప్రణవ కోనకు కంగువా (సూర్య) పాలకుడిగా ఉంటాడు. కంగువా గొప్ప వీరుడు. కపాల కోనకు పాలకుడిగా ఉధిరన్ (బాబీ డియోల్) ఉంటాడు. సముద్రం మీదుగా ఆ ప్రాంతానికి వచ్చిన రోమన్ చక్రవర్తి ప్రణవ కోనను తన వశం చేసుకోవాలని భావిస్తాడు. ఇందు కోసం ఐదుకోనల మధ్య అంతర్యుద్ధం జరిగేలా ప్రణాళిక వేస్తాడు. ఇందులో ప్రణవ కోన, హిమకోన ఒక వైపు.. మిగతా మూడు కోనలు మరోపక్షంలో నిలుస్తాయి. అయితే, యుద్ధానికి సిద్ధమవుతుండగా.. పలోమా అనే పిల్లాడి కోసం తన కోనను వదిలి చీకటి కోనలోకి కంగువా వెళ్తాడు. ఇంతకీ ఈ పలోమా ఎవరు? అతని కోసం కంగువ తన రాజ్యానికి ఎందుకు విడిచి వెళ్లాడు ? కపాల కోన పాలకుడు ఉధిరన్ కోరిక నెరవేరుతుందా? తన జాతి రక్షణ కోసం కంగువ మళ్లీ రణరంగంలోకి అడుగుపెడుతాడా? లేదా? అన్నది మూవీ స్టోరీ.
ఇదిలా ఉండగా.. మూవీ లౌడ్ సౌండ్ డిజైన్‌పై విమర్శలు వచ్చాయి. దీనిపై నిర్మాత కేకేఈ జ్ఞానవేల్ రాజా స్పందించారు. సౌండ్ మిక్సింగ్‌లో లోపముందని.. సౌండ్ మిక్సింగ్‌ని రీ వర్క్ చేసి వాల్యూం తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది భారీ బడ్జెట్‌తో వచ్చిన చిత్రాల్లో కంగువా ఒకటి. దాదాపు రూ.350కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రంలో నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్, మరిముత్తు, దీపా వెంకట్, రవి రాఘవేంద్ర, కేఎస్ రవికుమార్ నటించారు.