PCB : వన్డే వరల్డ్ కప్‌లో విఫలమైన పాకిస్థాన్(Pakistan) జట్టు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ తేలిపోయింది. కెప్టెన్లు మారినా ఆ జట్టు రాత మారలేదు. దానికి తోడూ స్టార్ ఆటగాళ్లు తరచూ గాయపడుతున్నారు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్నందున పాక్ క్రికెటర్ల ఫిట్నెస్(Fitness) సమస్యకు ఆదేశ క్రికెట్ బోర్డు(PCB) కీలక నిర్ణయం తీసుకుంది. ఆదేశ సైనికులతో ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనుంది. ఈ విషయాన్ని పీసీబీ కొత్త అధ్యక్షుడు మహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) తాజాగా వెల్లడించాడు.
ఇస్లామాబాద్‌లోని టీమ్ హోట్‌లో పాక్ ఆటగాళ్ల సమక్షంలో నఖ్వీ సైనిక శిక్షణ గురించిన వివరాలు తెలిపాడు. ‘త్వరలోనే న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లు ఉన్నాయి. శిక్షణ తీసుకునేందుకు సమయం ఎక్కడుంది. అందుకనే కకూల్లోని మిలిటరీ అకాడమీలో పాక్ ఆటగాళ్లకు 10 రోజుల ట్రైనింగ్ నిర్వహించనున్నాం. అందులో పాక్ సైనికులు వీళ్లకు సాయం చేయనున్నారు’ అని నఖ్వీ వెల్లడించాడు.
Had a productive session with Pakistani players in Islamabad today. Discussed the paramount importance of meritocracy in team selection, reaffirming that performance will always be the key criterion for selection/rejection . Zero tolerance for politics will ensure a fair and… pic.twitter.com/ejXQ3tV8K5
— Mohsin Naqvi (@MohsinnaqviC42) March 5, 2024
పాకిస్థాన్ సూపర్ లీగ్ 9వ ఎడిషన్ ముగియగానే పాక్ బృందం శిక్షణ మొదలెట్టనుంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకూ.. అంటే 10 రోజుల పాటు ఈ క్యాంప్ కొనసాగనుందని సమాచారం. ఈ క్యాప్ అనంతరం పాక్ జట్టు న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడనుంది.
అవి ముగిశాక జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఉంది. 2022లో రన్నరప్‌గా నిలిచిన పాక్ ఈసారి టైటిల్ కొట్టాలనే కసితో ఉంది. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన పొట్టి ప్రపంచకప్‌లో పాక్ అదరగొట్టింది. బాబర్ ఆజాం సారథ్యంలోని దాయాది జట్టు టీమిండియా చేతిలో ఓడినా.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే.. టైటిల్ పోరులో బట్లర్ సేన ధాటికి నిలవలేక కప్పు చేజార్చుకుంది.
ఈ ఏడాది జూన్ 1న టీ20 వరల్డ్ కప్ మొదలవ్వనుంది. ఈసారి వెస్టిండీస్, అమెరికాలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. న్యూయార్క్ వేదికగా జూన్ 9వ తేదీన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. దాంతో, చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు కోటి ఖర్చుపెట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. అవును. దాయాదుల మ్యాచ్ టికెట్ కనీస ధర రూ.1.8 కోట్లు పలుకుతోంది.