PCB : ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో అరంభించిన పాకిస్థాన్(Paksitan) రెండో టెస్టు కోసం సన్నద్ధమవుతోంది. బాక్సింగ్ డే టెస్టులో గెలుపొంది సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే.. పాక్ జట్టు ప్రదర్శనతో అసంతృప్తిగా ఉన్న ఆ దేశ క్రికెట్ బోర్డు హై ఫర్మార్మెన్స్ కోచ్ సైమన్ హెల్మట్(Simon Helmut) పై వేటు వేసింది. వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని మాజీ ఆల్‌రౌండర్ యాసిర్ అరాఫత్(Yasir Arafat)ను హై ఫర్మార్మెన్స్ కోచ్‌గా నియమించింది.
ఆస్ట్రేలియాకు చెందిన హెల్మట్ స్థానంలో యాసిర్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవిషయం ఏంటంటే.? ఈ ఏడాది ఆరంభంలో యాసిర్ పాక్ జట్టు బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, అతడికి నిరాశే మిగిలింది. చివరకు ఏడాది ముగుస్తుందనగా అతడిని పీసీబీ ఫర్మార్మెన్స్ కోచ్‌గా తీసుకుంది.
యాసిర్ అరాఫత్
యాసిర్ న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో బాధ్యతలు చేపట్టనున్నాడు. పదిహేడు మందితో కూడిన పాకిస్థాన్ బృందం 2024 జనవరిలో కివీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ జరుగనుంది. వరల్డ్ కప్ సన్నద్ధతకు ఈ సిరీస్ పాక్‌కు ఎంతో ఉపయోగపడనుంది. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్(T20World Cup)పోటీలకు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మోగా టోర్నీకి 20 జట్లు అర్హత సాధించాయి. ఈసారి పుపువా న్యూ గినియా, నమీబియా వంటి చిన్న జట్లు సైతం క్వాలిఫై అయ్యాయి. నిరుడు విజేతగా నిలిచిన ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.