PBKS vs MI | ముంబై : ఈనెల 11న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సి ఉన్న ఐపీఎల్ మ్యాచ్ వేదిక మారింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఎయిర్‌పోర్ట్‌లను మూసేసిన విషయం తెలిసిందే. ఇందులో ధర్మశాల కూడా ఒకటి.
షెడ్యూల్ ప్రకారం ముంబై ఆటగాళ్లు గురువారం ధర్మశాలకు చేరుకోవాల్సి ఉన్నా విమానాశ్రయాన్ని మూసేయడంతో మ్యాచ్ వేదికను మార్చడం అనివార్యమైంది. ఈ మేరకు బీసీసీఐ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) ఈ విషయాన్ని ధృవీకరించాయి.