Ayhika Mukherjee | చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ)లో శుక్రవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పుణెరీ పల్టాన్ 10-5తో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్‌పై అద్భుత విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో ఐహిక ముఖర్జీ 11-7, 11-5,11-6తో ప్రపంచ నంబ ర్13 బెర్నెడెట్టెకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వరుస గేముల్లో ప్రత్యర్థిని మట్టికరిపించింది.
తొలి పోరులో జావో మంటారియో 1-2తో మానుష్పై ఓడగా, మిక్స్డ్ డబుల్స్‌లో మంటారియో, ఐహిక ద్వయం 1-2తో మానుష్, షాక్స్‌పై పరాజయం పాలైంది. చివరి రెండు సింగిల్స్‌లో అంకూర్ 3-0తో లియాన్‌పై, నటాలియా 2-1తో రీత్పై గెలిచి పుణెకు బోణీ అందించారు.