మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ (Team India) కష్టాలో పడింది. 16 ఓవర్లలో 25 రన్స్ చేసిన టీమ్ఇండియా.. అదే స్కోర్ వద్ద రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. అప్పటివరకు నెమ్మదిగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (9).. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ వేసిన 17వ ఓవర్ మొదటి బంతికే స్లిప్‌లో మిచెల్ మార్షెల్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో తొలివికెట్ కోల్పోయిన భారత్‌కు కమిన్స్ మరోసారి షాక్ ఇచ్చాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ 4 బాల్స్ ఆడి స్లిప్‌లో రెండో స్లిప్‌లో కవాజాకు చిక్కాడు. దీంతో ఒకే ఓవర్లో రెండు ప్రధాన వికెట్లను కమిన్స్ పడగొట్టాడు.
అంతకుముందు 228/9తో ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ బ్యాటర్లు నాథన్ లైయన్, స్కాట్ బోలాండ్ మరో ఆరు పరుగులు మాత్రమే జోడించారు. రెండో ఓవర్లోనే లయన్‌ను స్టార్ పేసర్ బుమ్రా బౌల్డ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌కు 234 రన్స్ వద్ద తెరపడింది. దీంతో బుమ్రా ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. నెమ్మదిగా కొనసాగుతున్నది. ఆసీస్ బౌలర్లను ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డుకు ఒక్కోపరుగు జోడించారు. 17 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 25 పరుగులు మాత్రమే చేసింది. అప్రస్తుతం కోహ్లీ 0, జైస్వాల్ 12 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే మరో 315 పరుగులు చేయాల్సి ఉంది.
Cummins snaps Rohit and Rahul in a single over! 🔥
🔗 https://t.co/ycgxNhumqw | #AUSvIND pic.twitter.com/rnfUTI4CkQ
— ESPNcricinfo (@ESPNcricinfo) December 30, 2024