ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 26, 2020 , 00:11:14

8 మందే ఎందుకు..?

8 మందే ఎందుకు..?

  • బ్యాడ్మింటన్‌ జాతీయ క్యాంపుపై కశ్యప్‌ ప్రశ్నలు 

హైదరాబాద్‌:  బ్యాడ్మింటన్‌ జాతీ య క్యాంపును ఎనిమిది మంది ప్లేయర్లకే పరిమితం చేయడం సరైనది కాదని స్టార్‌ షట్లర్‌, కామన్వెల్త్‌ మాజీ చాంపియన్‌ పారుపల్లి కశ్యప్‌ అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో ఈ నెల 7వ తేదీ నుంచి జాతీయ క్యాంపు జరుగుతున్నది. ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు సహా 8 మంది ప్లేయర్లు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అయితే క్యాంపు కోసం కశ్యప్‌ను సాయ్‌ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో తన భార్య, స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌తో కలిసి కశ్యప్‌ హైదరాబాద్‌లోనే వేరే చోట ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. 


logo