పారిస్: ఆకాశమే అతని హద్దు! రెక్కలు కట్టుకుని గాలిలో విహరించినట్లు అతను అలవోకగా విహరిస్తాడు. అతని అద్భుత ప్రదర్శనకు ప్రపంచ రికార్డులు దాసోహమంటాయి. అతనెవరో కాదు పారిస్ ఒలింపిక్స్లో డెన్మార్క్ పోల్వాల్ట్ మ్యాస్ట్రో అర్మాండ్ డుప్లాంటిస్ కొత్త చరిత్ర లిఖించాడు. మానవ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అర్మాండ్ ఏకంగా 6.25 మీటర్లు ఎత్తు దూకి పసిడి పతకాన్ని సగర్వంగా ముద్దాడాడు. మంగళవారం జరిగిన పురుషుల పోల్వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో అర్మాండ్ 6.25 మీటర్లతో అగ్రస్థానంతో వరుసగా మూడోసారి ఒలింపిక్ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఈ క్రమంలో ఓవరాల్గా తన కెరీర్లో ఏకంగా తొమ్మిదో సారి ప్రపంచ రికార్డును తన పేరిట లఖించుకున్నాడు. 80,000 మంది ప్రేక్షకుల సమక్షంలో అర్మాండ్ చిరస్మరణీయ విజయాన్ని ఆస్వాదించాడు. టర్కీ వెటరన్ షూటర్ యూసుఫ్ డికెక్ను అనుసరిస్తూ సంబురాలు చేసుకున్నాడు. అన్నట్లు ఈ పోటీలో కెండ్రిక్స్(5.95మీ, అమెరికా), కరాలిస్(5.90, గ్రీస్) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.