Deepthi Jeevanji | హైదరాబాద్, ఆట ప్రతినిధి : పారాలింపిక్స్‌లో భాగంగా మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీకి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారం ప్రకటించింది. క్యాష్ ప్రైజ్‌తో పాటు ఆమెకు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది.
ఆదివారం దీప్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా సీఎం ఆమెను సత్కరించారు. దీప్తి కోచ్ నాగపురి రమేశ్ బాబుకూ రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీప్తికి నగదు పురస్కారం, ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలాన్ని కేటాయించడంపై తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే. శివసేనా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.