Paralympics | పారా బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్, నితేశ్ కుమార్ సెమీస్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీ క్వార్టర్స్‌లో సుహాస్ 26-24, 21-14తో షిన్ క్యుంగ్ హ్వాన్ (కొరియా)ను ఓడించాడు. ఎస్ఎల్3 విభాగంలో నితేశ్.. 21-5, 21-11తో చైనాకు చెందిన యంగ్ జియాన్యున్ను చిత్తుచేశాడు. కాగా మానసి జోషి, టోక్యో కాంస్య పతక విజేత మనోజ్ సర్కార్ పోరాటం ముగిసింది.
ఆర్చరీ పురుషుల కాంపౌండ్ ఓపెన్ కేటగిరీ రాకేశ్ కుమార్ ప్రిక్వార్టర్స్ చేరాడు. టేబుల్ టెన్నిస్‌లో సోనియాబెన్, భవీనా పటేల్ ద్వయం 1-3తో మూన్ సుంగ్-జంగ్ యంగ్ (కొరియా) చేతిలో ఓటమి పాలైంది. రోయింగ్ మిక్స్డ్ పీఆర్3 డబుల్ స్కల్స్‌లో భారత రోయర్లు అనిత, కొంగనపల్లె ఐదో స్థానంతో సరిసెట్టుకున్నారు. మహిళల డిస్కస్ త్రో (ఎఫ్55)లో సాక్షి కసానా 8వ స్థానంలో నిలిచింది.