IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసులోకి కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) దూసుకొచ్చింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)ను ఒక్క పరుగు తేడాతో ఓడించింది. రియాన్ పరాగ్(95) పవర్ హిట్టింగ్తో భయపెట్టినా.. హర్షిత్ రానా(2-41) రెండు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అయితే.. 20వ ఓవర్లో శుభమ్ దూబే(25) 6, 4, 6 బాదడంతో కోల్‌కతా శిబిరంలో కలవరం మొదలైంది. కానీ, రెండో పరుగు తీసే క్రమంలో జోఫ్రా ఆర్చర్(12) రనౌటయ్యాడు. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో గెలుపొందిన రహానే బృందం ప్లే ఆఫ్స్ అశల్ని సజీవంగా ఉంచుకుంది.
ఐపీఎల్ 18వ సీజన్లో మరో ఉత్కంఠ పోరు. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సమిష్టి ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఆండ్రూ రస్సెల్(57 నాటౌట్) మెరుపులతో భారీ స్కోర్ కొట్టిన కోల్‌కతా ప్రత్యర్థిని 2025 పరుగులకే కట్టడి చేసింది. ఛేదనలో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(4)మరోసారి నిరాశపరిచాడు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో టైమింగ్‌కు కుదరక.. అజింక్యా రహానే చేతికి చిక్కాడు. ఆ తర్వాత మోయిన్ అలీ(2-15), వరుణ్ చక్రవర్తి(2-11)లు తిప్పేయడంతో యశస్వీ జైస్వాల్(34), ధ్రువ్ జురెల్(0), హసరంగ(0)లు పెవిలియన్ చేరారు. 71కే సగం వికెట్లు కోల్పోయిన జట్టును గెలిపించేందుకు కెప్టెన్ రియాన్ పరాగ్(95), హెట్‌మైర్(29)లు భుజానికెత్తుకున్నారు.
#RR put on a superb fight 👏
And it all started when their captain Riyan Parag shifted the gears with 6️⃣ sixes in a 𝗥𝗢𝗪!
Watch his brutal hitting ▶ https://t.co/cJgk1XSmEm #TATAIPL | #KKRvRR | @ParagRiyan pic.twitter.com/UCkPjMc0pl
— IndianPremierLeague (@IPL) May 4, 2025
వరుసగా వికెట్లు పడినా కెప్టెన్ రియాన్ పరాగ్(32 నాటౌట్) మాత్రం పట్టువిడవ లేదు. ఒంటరి పోరాటం చేసిన అతడు సిక్సర్లతో రెచ్చిపోయాడు. మోయిన్ అలీని ఉతికేస్తూ ఏకంగా ఐదు సిక్సర్లు బాది మ్యాచ్‌ను రాజస్థాన్‌ను వైపు తిప్పాడు. హెట్‌మైర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 92 రన్స్ జోడించి జట్టును గెలుపు వాకిట నిలిపాడు. అయితే.. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన హర్షిత్ రానా(2-41) ఈ ఇద్దరిని ఔట్ చేయడంతో కోల్‌కతా పోటీలోకి వచ్చింది. ఆ తర్వాత ఇంప్యాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే(25) .. వైభవ్ ఆరోరా వేసిన 20వ ఓవర్లో 6, 4, 6 బాదాడు. దాంతో, ఆఖరి బంతికి 3 పరుగులు అవసరమయ్యాయి. అయితే.. రెండో పరుగు తీసే క్రమంలో ఆర్చర్ రనౌట్ కావడంతో కోల్‌కతా ఒక్క రన్ తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.
Another day, another #TATAIPL classic 🤩@KKRiders prevail by 1️⃣ run in a last-ball thriller in Kolkata to boost their playoff hopes 👏💜
Scorecard ▶ https://t.co/wg00ni9CQE#KKRvRR pic.twitter.com/mJxuxBSPqw
— IndianPremierLeague (@IPL) May 4, 2025
సొంతమైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ సమిష్టిగా పంజా విసిరారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(35), కెప్టెన్ అజింక్యా రహానే(30)లు బలమైన పునాది వేశారు. అయితే మిడిల్ ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోర్ మందగించింది. అయితే.. డెత్ ఓవర్లలో ఆండ్రూ రస్సెల్(57 నాటౌట్) గేర్ మార్చి విధ్వంసం సృష్టించాడు.
రఘువంశీ(44), రస్సెల్(57 నాటౌట్)
అంగ్క్రిష్ రఘువంశీ(44)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆకాశ్ మధ్వాల్ ఓవర్లో వరుసగా 4, 6, 4 తో 15 రన్స్ సాధించాడు. ఆ తర్వాత ఆర్చర్‌కు చుక్కుల చూపిస్తూ 6, 4 బాదాడు. థీక్షణ వేసిన 18వ ఓవర్లో ఈ డాషింగ్ హిట్టర్ హ్యాట్రిక్ సిక్సర్లతో జట్టు స్కోర్ 160 దాటించాడు. నాలుగో వికెట్‌కు 32 బంతుల్లోనే 61 పరుగుల కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారిద్దరూ. 20వ ఓవర్లో రింకూ సింగ్() 4, 6, 6 బాదేయడంతో కోల్‌కతా స్కోర్ 200లు దాటింది.