Paralympics 2024 : పారిస్ వేదికగా జరుగుతున్న పారిలింపిక్స్లో భారత షూటర్లు పతక గర్జన చేశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అవనీ లేఖరా(Aavni Lekhara) పసిడి పతకం కొల్లగొట్టింది. రికార్డు స్కోర్‌తో చరిత్ర సృష్టించిన ఆమె దేశానికి తొలి పతకం అందించింది. టోక్యో పారిలింపిక్స్లోనూ స్వర్ణం సాధించిన ఆమెకు ఇది రెండో గోల్డ్ మెడల్. ఇక ఇదే పోటీల్లో భారత పారా షూటర్ మోనా అగర్వాల్(Mona Agarwal) కాంస్య పతకంతో మెరిసింది.
పారాలింపిక్స్‌లో భారత్ స్వర్ణంతో పతకాల ఖాతా తెరిచింది. అది కూడా షూటర్ల తరఫున దేశం తొలి పతకం అందుకుంది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ రౌండ్లో అవని లెఖారా, మోనాల గురి అదిరింది. అవని
రెండో స్థానంలో నిలువగా, మోనా అగర్వాల్ ఐదోస్థానం సాధించింది. దాంతో ఇద్దరూ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
GOLD 🥇 For INDIA 🇮🇳
Avani Lekhara wins gold medal in the Women’s 10m air Rifle SH1 event with a score of 249.7 🙌#Paris2024 #Cheer4Bharat #Paralympics2024 @mansukhmandviya @MIB_India @PIB_India @IndiaSports @ParalympicIndia @PCI_IN_Official @Media_SAI @AkashvaniAIR… pic.twitter.com/mcFf6gxQ1t
— Doordarshan Sports (@ddsportschannel) August 30, 2024
ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఫైనల్లో తొలుత అవని వెనకబడింది. అయితే.. తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్న దక్షిణ కొరియా పారా షూటర్ లీ యున్రీ(Lee Yunri)ఆఖరి రౌండ్లో తడబడింది. యున్రీ 6.8 పాయింట్లకే పరిమితమవ్వగా.. అవని చెక్కు చెదరని గురితో 10.5 పాయింట్లు సాధించింది. దాంతో, మొత్తంగా 249.7 పాయింట్లతో రికార్డు నెలకొల్పిన భారత పారా షూటర్ పసిడి వెలుగులు విరజిమ్మింది.
Congratulations to Mona Agarwal for winning the bronze medal in the R2 Women’s 10M Air Rifle SH1 at the #Paralympics2024! Your precision, focus & relentless dedication have brought immense pride to our nation.
Well done, Mona!#Cheer4Bharat pic.twitter.com/98AqohGxPm— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) August 30, 2024
క్వాలిఫికేషన్ రౌండ్లో మెరిసిన మోనా అగర్వాల్ మాత్రం ఫైనల్లో అంచనాలు అందుకోలేకపోయింది. 228.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి మోనా కంచు మోత మోగించింది. దాంతో, ఒకే ఈవెంట్లో ఇద్దరు భారత పారా షూటర్లు రెండు పతకాలతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు.