మలక్‌పేట, సెప్టెంబర్ 6 :ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి శుక్రవారం నగరానికి చేరుకున్న యువ అథ్లెట్ జీవాంజి దీప్తికి ఘన స్వాగతం లభించింది. వందలాది మంది అభిమానులతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణం కోలహలంగా మారింది.
స్వాగత కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివాసేనారెడ్డి, కోచ్‌లు రమేశ్, గోపీచంద్, తెలంగాణ పారా అసోసియేషన్ ప్రతినిధులు వీరయ్య, బాబు, ప్రశాంత్ పాల్గొన్నారు.